వరద సాయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలే తిన్నారు: ఉత్తమ్
దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వరదలతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, వరద సాయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు మింగేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ విమర్శించారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, మెట్రోరైలు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, కృష్ణ జలాలు వచ్చాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒరిగిందేమీ లేదని, హైదరాబాద్‌లో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదన్నారు. తెలంగాణకు బీజేపీ ఇప్పటివరకు రూపాయి తేలేదని, టీఆర్ఎస్, బీజేపీకి ఓట్లు అడిగే […]
దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వరదలతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, వరద సాయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు మింగేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ విమర్శించారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, మెట్రోరైలు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, కృష్ణ జలాలు వచ్చాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒరిగిందేమీ లేదని, హైదరాబాద్‌లో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదన్నారు. తెలంగాణకు బీజేపీ ఇప్పటివరకు రూపాయి తేలేదని, టీఆర్ఎస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కరోనాతో జనం చచ్చిపోతుంటే సీఎం ఫాంహౌస్‌లో పడుకున్నాడని విమర్శించారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై ఉత్తమ్ ఆగ్రహం..
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎన్నికల నిబంధనల్లో ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో పిల్లర్లకు టీఆర్ఎస్ కటౌట్లు పెడితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందని, టీఆర్ఎస్ కటౌట్లు తొలగించనందుకు సిగ్గుపడాలన్నారు. మంత్రి కేటీఆర్ రోడ్‌షోకు ఎల్ఈడీ లైట్లకు అనుమతిచ్చారని, కాంగ్రెస్ నుంచి అడిగితే ఇవ్వలేదన్నారు.