ఇండోర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్ రాకెట్
దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ నగరం డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని మరోసారి రుజువయ్యింది. హైదరాబాద్ కేంద్రంగా తయారైన డ్రగ్స్‌ను ఇండోర్ మీదుగా సౌతాఫ్రికా తరలిస్తుండగా ఇండోర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి దాదాపు రూ.70 కోట్ల విలువ చేసే 70 కేజీల డ్రగ్స్‌ను ఇండోర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. నగరంలోని సనత్‌నగర్‌కు చెందిన వేద ప్రకాష్ వ్యాస్ శివారు ప్రగతినగర్ ప్రాంతంలో డ్రగ్స్ తయారీ కంపెనీ […]
దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ నగరం డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని మరోసారి రుజువయ్యింది. హైదరాబాద్ కేంద్రంగా తయారైన డ్రగ్స్‌ను ఇండోర్ మీదుగా సౌతాఫ్రికా తరలిస్తుండగా ఇండోర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి దాదాపు రూ.70 కోట్ల విలువ చేసే 70 కేజీల డ్రగ్స్‌ను ఇండోర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. నగరంలోని సనత్‌నగర్‌కు చెందిన వేద ప్రకాష్ వ్యాస్ శివారు ప్రగతినగర్ ప్రాంతంలో డ్రగ్స్ తయారీ కంపెనీ నిర్వహిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో తయారు చేస్తున్న మత్తు పదార్థాలను సౌతాఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీలో ఎస్టాకి పిల్స్ అనే డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్టుగా సమాచారం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు.. ఆ ప్రాంతంలో తనిఖీలు చేయగా, అక్కడ మత్తు పదార్థాల తయారీకి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కన్పించలేదు. ఈ క్రమంలో ఇండోర్ పోలీసులకు పట్టుబడిన వేద ప్రకాష్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను విచారణ నిమిత్తం నగరానికి తీసుకొస్తేనే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. భారీ మొత్తంలో రూ.70 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడటంతో నగరంలో సంచలనంగా మారింది.