ఉద్యోగాల పేరుతో రూ.3 కోట్లకు టోకరా

దిశ, క్రైమ్ బ్యూరో : హైకోర్టులో ఉద్యోగాల నియామకాల పేరుతో తప్పుడు నోటిఫికేషన్ సృష్టించి, పలువురు నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జనగాం జిల్లాకు చెందిన తిరునహరి విష్ణుమూర్తి (55), హైదరాబాద్ డబీర్ పురాకు చెందిన మహావీర్ (42)లు రాష్ట్ర హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్, అటెండర్లు, డ్రైవర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు 160 మంది నుంచి భారీగా డబ్బులు దండకుంటున్నట్టు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. […]

Update: 2020-11-19 11:25 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : హైకోర్టులో ఉద్యోగాల నియామకాల పేరుతో తప్పుడు నోటిఫికేషన్ సృష్టించి, పలువురు నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జనగాం జిల్లాకు చెందిన తిరునహరి విష్ణుమూర్తి (55), హైదరాబాద్ డబీర్ పురాకు చెందిన మహావీర్ (42)లు రాష్ట్ర హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్, అటెండర్లు, డ్రైవర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు 160 మంది నుంచి భారీగా డబ్బులు దండకుంటున్నట్టు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు విష్ణుమార్తి, మహావీర్ లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులు సంజయ్ కుమార్, దశరథ్‌లను ఇదివరకే అరెస్టు చేసినట్టు అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు.

Tags:    

Similar News