వాహనదారులకు ఊరట.. పోలీసులకు ఆ అధికారం లేదు.. సీపీకి లీగల్ నోటీసు

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో పోలీసులు డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే నగరంలో పలు చోట్ల పోలీసులు బైకుపై వెళ్తున్న యువకులను ఆపి.. వారి వాట్సాప్ చెక్ చేస్తున్నారు. వాట్సాప్‌లో గంజా అని టైప్ చేసి ఫోన్ తనిఖీ చేస్తున్నారు. ఒకవేళ డ్రగ్స్ రిలేటెడ్ ఏదైనా కంటెంట్ వారి ఫోన్‌లో దొరికితే వారిని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. లేదంటే వారిని వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువత మొబైల్ ఫోన్‌లను చెక్ చేయడం […]

Update: 2021-10-30 23:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో పోలీసులు డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే నగరంలో పలు చోట్ల పోలీసులు బైకుపై వెళ్తున్న యువకులను ఆపి.. వారి వాట్సాప్ చెక్ చేస్తున్నారు. వాట్సాప్‌లో గంజా అని టైప్ చేసి ఫోన్ తనిఖీ చేస్తున్నారు. ఒకవేళ డ్రగ్స్ రిలేటెడ్ ఏదైనా కంటెంట్ వారి ఫోన్‌లో దొరికితే వారిని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. లేదంటే వారిని వదిలేస్తున్నారు.

ఈ నేపథ్యంలో యువత మొబైల్ ఫోన్‌లను చెక్ చేయడం వెంటనే నిలిపివేయాలని కోరుతూ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌కు నగరానికి చెందిన స్వతంత్ర గోప్యతా పరిశోధకుడు శ్రీనివాస్ కొడాలి లీగల్ నోటీసులు పంపారు. పౌరుల మొబైల్ ఫోన్‌లను చెక్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి ముందు సంబంధిత పోలీసు అధికారులు ఏవైనా ముందస్తు వారెంట్‌లు లేదా డిపార్ట్‌మెంటల్ సూచనలు పొందారా అనే విషయాన్ని బహిర్గతం చేయాలని నోటీసులో కోరాడు.

సాధారణ పౌరులను ఆపడానికి, వారి మొబైల్ ఫోన్లను అన్‌లాక్ చేయమని, వారి ఫోన్లలో మెసేజ్లను సెర్చ్ చేయమని అడగడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) కింద పోలీసులకు ఎటువంటి అధికారాలు ఇవ్వబడలేదని లీగల్ నోటీసులో తెలిపారు.

అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతీ పౌరుడికి కొన్ని హక్కులు ఉన్నాయని తెలంగాణ హైకోర్టు న్యాయవాది కారం కొమిరెడ్డి అన్నారు. వారిని ఇలా రోడ్డుపై ఆపి.. ఫోన్లు చెక్ చేయడం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని తెలిపారు.

Tags:    

Similar News