Ys Jagan: ఈసారి పక్కా.. హామీ ఇస్తున్నా..!

ఈసారి కచ్చితంగా అండగా ఉంటానని కార్యకర్తలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు...

Update: 2025-01-08 14:38 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈసారి కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటానని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Chief Minister Jagan Mohan Reddy) హామీ ఇచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ వాళ్లపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం నుంచి కర్నూల్ వరకు ఇదే జరుగుతోందని, అరెస్టుల పేరుతో ప్రతి జిల్లాలో నాలుగైదు రోజులు ఉంచుతున్నారని వ్యాఖ్యానించారు. మన కార్యకర్తలను కొట్టేది వాళ్లే అక్రమ కేసులు పెట్టేది వాళ్లేనని ఆరోపించారు. ఒక మనిషిని ఏకంగా 10 చోట్ల తిప్పుతున్నారన్నారు. ఇప్పుడున్న పరిస్థితి గతంలో ఎన్నడూ లేదన్నారు. వైసీపీ(Ycp) జెండా మోసే ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

‘‘ఆరు నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల వాగ్ధానాలను గాలికొదిలేశారు. చంద్రబాబు(Chandrababu)కు వ్యక్తిత్వం, విశ్వసనీయత లేదు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మా పథకాలను రద్దు చేశారు. చంద్రబాబు, వైసీపీ పాలన మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. అన్ని పథకాలు ఇంటి వద్దనే ఇచ్చాం. చంద్రబాబు అలా చేయలేకపోతున్నారు. మేము అధికారంలో ఉంటే ఐదేళ్ల పాటు ఏదో ఒక పథకం ప్రకటిస్తూనే ఉండే వాళ్లం.’’ అని జగన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News