ప్రియుడి కోసం భర్తను చంపించింది

తాళి కట్టిన భర్తతో కాకుండ ప్రేమించిన ప్రియుతో ఉండాలనుకుంది. ప్రియుడు ఇచ్చిన మత్తు మాత్రలను రోజు భోజనంలో కలిపి భర్తకు వడ్డించేది.. భర్త అనారోగ్యంపాలవ్వడంతో ప్రియుడితో సరసాలాడేది. ఎప్పటికైనా భర్తతో ఇబ్బంది వస్తాదని అనుకుందేమో అంతమొందించేందుకు ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసింది. అంతా అనుకున్నట్టే భర్తను చంపించి, ఏమీ ఎరుగనట్టు నంగనాచిలా నాటకాలాడింది. కొన్ని రోజుల తరువాత భర్త హత్య గురించి ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా.. కూతురు వినింది. దీంతో ఆ యువతి బంధువుల సహాయంతో […]

Update: 2020-06-30 11:55 GMT

తాళి కట్టిన భర్తతో కాకుండ ప్రేమించిన ప్రియుతో ఉండాలనుకుంది. ప్రియుడు ఇచ్చిన మత్తు మాత్రలను రోజు భోజనంలో కలిపి భర్తకు వడ్డించేది.. భర్త అనారోగ్యంపాలవ్వడంతో ప్రియుడితో సరసాలాడేది. ఎప్పటికైనా భర్తతో ఇబ్బంది వస్తాదని అనుకుందేమో అంతమొందించేందుకు ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసింది. అంతా అనుకున్నట్టే భర్తను చంపించి, ఏమీ ఎరుగనట్టు నంగనాచిలా నాటకాలాడింది. కొన్ని రోజుల తరువాత భర్త హత్య గురించి ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా.. కూతురు వినింది. దీంతో ఆ యువతి బంధువుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్య చేసిన దారుణం గుట్టురట్టు అయింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వీవీమెరకలోని ప్రగతినగర్‌లో ఉప్పు ప్రసాద్‌(48), భార్య ప్రశాంతి, కూతురుతో కలిసి నివసిస్తున్నారు. ఉప్పు ప్రసాద్‌ తన ఇంటివద్దనే సోడా కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రశాంతి కేసువదాసుపాలెంకు చెందిన రౌడీషీటర్ చొప్పల సుభాకర్‌ అలియాస్ శివతో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. ప్రమీల తన భర్త ప్రసాద్‌కు రోజు భోజనంలో మత్తు బిల్లులు వేసి ఇస్తూ అనారోగ్యంపాలు చేసింది. శివతో అక్రమ సంబంధానికి తన భర్త ఎప్పటికైనా అడ్డువస్తాడు అనుకొని చంపడానికి పక్కా స్కెచ్ వేసింది.

జూన్ 2న ప్లాన్‌లో భాగంగా.. తనకు అలసటగా ఉందని నిమ్మసోడా కావాలని భర్తను ప్రశాంతి అడిగింది. నిమ్మసోడా కోసం ప్రసాద్‌ తన దుకాణంలోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న సుభాకర్‌ అతని అనుచరులు నల్లి వెంకటనరసింహారావు, జిల్లెళ్ల ప్రసాద్‌లు కలిసి ప్రసాద్‌ మెడకు తువాలతో ఉరివేసి కుర్చిలో కుర్చోపెట్టి వెళ్లిపోయారు. అయితే, ఇదేమీ ఎరుగనట్లు ప్రశాంతి హడావుడి చేసి కుమార్తె, స్థానికుల సహాయంతో భర్తను రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రసాద్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు సహజ మరణంగా భావించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రసాద్ చనిపోయి రెండు వారాలు గడిచింది. ప్రశాంతి తన భర్త హత్య గురించి ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా కూతురు విని, బంధువుల సహాయంతో జూన్ 24 సఖినేటిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రశాంతిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా జరిగిన విషయాన్ని పూసగుంచినట్లు వివరించింది. ప్రసాద్ హత్యలో కీలక సూత్రాదారులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరిలించినట్లు రాజోలు డీఎస్పీ తెలిపారు.

Tags:    

Similar News