భార్య చేసిన పని తట్టుకోలేని భర్త.. స్నేహితులతో కలిసివెళ్లి 27 సార్లు..

దిశ, వెబ్‌డెస్క్: ఏ బంధమైన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. మరి ముఖ్యంగా వివాహ బంధంలో ప్రేమ తో పాటు నమ్మకం అనేది చాలా అవసరం. అవి లేకనే ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ఇంకెన్నో జంటల మధ్య వివాదాలు.. ఆ వివాదాల వలన ఒకరిని ఒకరు చంపుకొనేవరకు వెళ్తున్నారు. తాజాగా తనకు విడాకులు ఇచ్చి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో భార్యను అతి కిరాతకంగా చంపాడో భర్త. ఈ దారుణ ఘటన  అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. […]

Update: 2021-08-05 22:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏ బంధమైన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. మరి ముఖ్యంగా వివాహ బంధంలో ప్రేమ తో పాటు నమ్మకం అనేది చాలా అవసరం. అవి లేకనే ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ఇంకెన్నో జంటల మధ్య వివాదాలు.. ఆ వివాదాల వలన ఒకరిని ఒకరు చంపుకొనేవరకు వెళ్తున్నారు. తాజాగా తనకు విడాకులు ఇచ్చి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో భార్యను అతి కిరాతకంగా చంపాడో భర్త. ఈ దారుణ ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే.. థారా గ్రామానికి చెందిన అజయ్ ఠాకూర్ అనే వ్యక్తికి హేమ అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లైన కొద్దీ రోజులు ఏ కలతలు లేకుండా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఒకరి మీద ఒకరు నిత్యం గొడవపడుతుండేవారు. ఇక ఈ నేపథ్యంలోనే భర్త ప్రవర్తన నచ్చని హేమ.. అతడికి దూరంగా బతకాలనుకుంది. ఇద్దరు పిల్లలను తండ్రి వద్దే ఉంచి ఆమె వెళ్ళిపోయింది. ఆ తరువాత అతనికి విడాకులు ఇచ్చి మహేష్ ఠాకూర్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అజయ్ ఠాకూర్ కు భార్య విడాకులు ఇవ్వడం, ఇద్దరు పిల్లలను ఎలా చూసుకోవాలనే ఆవేదన ఎక్కువై మద్యానికి బానిస అయ్యాడు. తనకు ఇలాంటి దుస్థితి తీసుకొచ్చిన భార్యపై పగ పెంచుకున్న అజయ్ ఠాకూర్ హేమాను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

ఇదే విషయాన్ని స్నేహితులతో చర్చించి పక్కా ప్లాన్ వేశాడు. బుధవారం రాత్రి అజయ్ ఠాకూర్ తన ఇద్దరి స్నేహితులను వెంటబెట్టుకుని హేమ, మహేష్ ఠాకూర్ ఉంటున్న ఇంటికి వెళ్లాడు. రెండో భర్త ఇంట్లో లేడని తెలుసుకొని ఒక్కసారిగా మాజీ భార్యపై దాడికి తెగబడ్డాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా అజయ్ స్నేహితులు అడ్డుకున్నారు. చివరికి హేమను వెంటాడి మరీ అత్యంత కిరాతకంగా 27సార్లు కత్తితో పొడిచి చంపాడు. హేమ మరణించిందని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి అజయ్ ఠాకూర్ అతని స్నేహితులు పరారయ్యారు. ఇక కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన రెండో భర్తకు హేమ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. వెంటనే మహేష్ ఠాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News