భార్య ప్రేమగా లంచ్ పంపిస్తే.. భర్త ఏం చేశాడో తెలుసా
దిశ, వెబ్ డెస్క్ : ఎవరైనా ఇంటి ఫుడ్ నే ఇష్టపడుతారు. ఇక అబ్బాయిలు మాత్రం బాగా వంటలొచ్చి వండిపెట్టే భార్య రావలి తాను చక్కగా వండిపెడితే చాలు అనుకుంటారు. కానీ విచిత్రంగా భార్య మంచిగా వండి, ప్రేమగా లంచ్ పంపిస్తే దాన్ని ఆఫీసులో అమ్ముకుంటున్నాడు ఓ భర్త. అది తెలిసిన భార్య తెగ బాధపడిపోయింది. భార్యాభర్తలు కొత్తగా అపార్ట్‌మెంట్ కొనుక్కుందామని ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం తమ ఖర్చులను నియంత్రించుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే భర్తకి రోజూ […]
దిశ, వెబ్ డెస్క్ : ఎవరైనా ఇంటి ఫుడ్ నే ఇష్టపడుతారు. ఇక అబ్బాయిలు మాత్రం బాగా వంటలొచ్చి వండిపెట్టే భార్య రావలి తాను చక్కగా వండిపెడితే చాలు అనుకుంటారు. కానీ విచిత్రంగా భార్య మంచిగా వండి, ప్రేమగా లంచ్ పంపిస్తే దాన్ని ఆఫీసులో అమ్ముకుంటున్నాడు ఓ భర్త. అది తెలిసిన భార్య తెగ బాధపడిపోయింది.
భార్యాభర్తలు కొత్తగా అపార్ట్‌మెంట్ కొనుక్కుందామని ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం తమ ఖర్చులను నియంత్రించుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే భర్తకి రోజూ ఫాస్ట్‌ఫుడ్ తినే అలవాటు. ఆయన రోజుకి సుమారు 20 డాలర్లు ఖర్చు చేస్తున్నాడు. ఆ ఖర్చుని తగ్గించేందుకు అతని భార్య ఆయనకి లంచ్ తయారుచేసి పంపించేది. అయితే ఆమె లంచ్ బాక్స్‌లో పెట్టిన శాండ్‌విచ్‌లను భర్త ఆఫీస్‌లో అమ్మకానికి పెట్టేవాడు. ఆ వచ్చిన డబ్బులతో ఎంచక్కా ఫాస్ట్‌ఫుడ్ తెప్పించుకుని తినేవాడు.
అయితే ఒక సారీ తన మిత్రుడు, సహాద్యోగిని డిన్నర్ కి ఆహ్వానించాడు. వారు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటున్న సమయంలో అతను నోరు జారి మీరు శాండ్ విచ్ లు బాగా చేస్తారు చెల్లెమ్మ అన్నాడు. దీంతో ఆమెకి ఇతను ఎప్పుడు నా వంట రుచి చూశాడు రేటు ఎంటీ అని ఆశ్చర్య పోయింది. తర్వాత అసలు విషయం తెలుసుకుని చాలా బాధపడింది. నేను మీకు ఎంతో ప్రేమగా లంచ్ పంపిస్తే దాన్ని మీరు అమ్ముకుంటారా అంటూ అరిచింది. జీవితంలో మీకు ఇక లంచ్ తయారుచేయనని లంచే కాదు సింగిల్ టీ కూడా పెట్టి ఇవ్వనని తెగేసి చెప్పేసింది. ఆ తరువాత తన బాధనంతా సోషల్ మీడియావేదికగా షేర్ చేసింది. రెడిట్‌లో యు డానీ పేరుతో పెట్టిన ఈ పోస్ట్ తెగ సర్కులేట్ అవుతుంది.