భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త
దిశ, మెదక్: కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాక్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాశీంపూర్ గ్రామానికి చెందిన సున్నపు పుణ్యవతి (30)ని గ్రామ శివారున ఉన్న వ్యవసాయ భూమిలో ఆమె భర్త గొంతు కోసి హత్య చేశాడు. గత కొంత కాలం నుంచి భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతన్న నేపథ్యంలో.. భర్త దారుణానికి […]
దిశ, మెదక్: కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాక్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాశీంపూర్ గ్రామానికి చెందిన సున్నపు పుణ్యవతి (30)ని గ్రామ శివారున ఉన్న వ్యవసాయ భూమిలో ఆమె భర్త గొంతు కోసి హత్య చేశాడు. గత కొంత కాలం నుంచి భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతన్న నేపథ్యంలో.. భర్త దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వివరణ ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై గణేష్ తెలిపారు.