బెడ్ కింద భార్య శవం.. పైన భర్త. రెండురోజులుగా..

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తు దారుణానికి ఒడిగట్టింది. తాగుడికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను కడతేర్చాడు. అంతేకాదు.. ఆ మృతదేహాన్ని రెండు రోజుల పాటు బెడ్ కింద దాచిపెట్టాడు. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన భోపాల్ జిల్లాలో జరిగింది. షేర్ సింగ్ అహివార్, ఆర్తీ అహివార్ దంపతులు భోపాల్ జిల్లాలో నివాసం ఉంటున్నారు. అయితే, తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి మద్యం తాగి వచ్చిన షేర్ […]

Update: 2020-07-08 05:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తు దారుణానికి ఒడిగట్టింది. తాగుడికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను కడతేర్చాడు. అంతేకాదు.. ఆ మృతదేహాన్ని రెండు రోజుల పాటు బెడ్ కింద దాచిపెట్టాడు. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన భోపాల్ జిల్లాలో జరిగింది. షేర్ సింగ్ అహివార్, ఆర్తీ అహివార్ దంపతులు భోపాల్ జిల్లాలో నివాసం ఉంటున్నారు. అయితే, తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి మద్యం తాగి వచ్చిన షేర్ సింగ్ భార్యతో గొడవపడ్డాడు. ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో.. ఓ గొడ్డలి తీసుకొచ్చి భార్యను నరికి చంపాడు. అనంతరం శవాన్ని డబుల్ కాట్ బెడ్ బాక్స్‎లో దాచిపెట్టాడు. ఇదే మాట తాగిన మత్తులో అతడితో సన్నిహితంగా ఉండేవారికి చెప్పాడు. అయితే, రెండు రోజులుగా ఆర్తీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇంట్లో సోదాలు చేశారు. డబుల్ బెడ్ కాట్ బాక్స్ ఉన్న శవాన్ని బయటతీసి.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News