అనుపమకు ‘దిల్’దార్‌గా..

దిశ, వెబ్‌డెస్క్: అనుపమ పరమేశ్వరన్.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లో ఏకకాలంలో సినిమాలు చేస్తోంది. అన్ని ఇండస్ట్రీల్లోనూ బెస్ట్ అనిపించుకున్న ఈ భామ .. తెలుగులో ‘ప్రేమమ్’, ‘అఆ’, ‘శతమానం భవతి’, ‘హలో గురూ ప్రేమకోసమే’, ‘రాక్షసుడు’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు టాలీవుడ్‌లో మరో మూవీకి ఓకే చెప్పింది అనుపమ. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి […]

Update: 2020-03-11 01:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: అనుపమ పరమేశ్వరన్.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లో ఏకకాలంలో సినిమాలు చేస్తోంది. అన్ని ఇండస్ట్రీల్లోనూ బెస్ట్ అనిపించుకున్న ఈ భామ .. తెలుగులో ‘ప్రేమమ్’, ‘అఆ’, ‘శతమానం భవతి’, ‘హలో గురూ ప్రేమకోసమే’, ‘రాక్షసుడు’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు టాలీవుడ్‌లో మరో మూవీకి ఓకే చెప్పింది అనుపమ. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరో. సినిమాకు ‘రౌడీ బాయ్స్’ టైటిల్ కన్‌ఫాం కాగా… హీరోయిన్‌గా అనుపమ అయితేనే కరెక్ట్ అని అనుకున్నారట దిల్ రాజు. అందుకే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా … ఆశిష్ రెడ్డికి జంటగా అనుపమను సెలెక్ట్ చేశారట. కాగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

tags:Anupama Parameswaran, Ashish Reddy, Dil Raju Movie, Producer, Remuneration

Tags:    

Similar News