వరద నీటిలో ఏడుపాయల గుడి.. దుర్గామాత పూజలు ఎలా ?
దిశ, మెదక్ : రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద ఆలయం వనదుర్గ ఆలయం. ఇప్పుడు ఇది జల దిగ్బంధంలో మునిగి తేలుతోంది. మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో వెలిసిన వన దుర్గామాత ఆలయం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువన ఉన్న సింగూరు జలాశయం గేట్లు ఎత్తడంతో మంగళవారం దిగువకు వదిలిన నీటి ప్రవాహంతో గణపతి ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. దీంతో ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో ఏడుపాయల దుర్గామాత పాదాలను […]
దిశ, మెదక్ : రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద ఆలయం వనదుర్గ ఆలయం. ఇప్పుడు ఇది జల దిగ్బంధంలో మునిగి తేలుతోంది. మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో వెలిసిన వన దుర్గామాత ఆలయం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువన ఉన్న సింగూరు జలాశయం గేట్లు ఎత్తడంతో మంగళవారం దిగువకు వదిలిన నీటి ప్రవాహంతో గణపతి ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. దీంతో ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో ఏడుపాయల దుర్గామాత పాదాలను తాకుతూ మంజీర నది ప్రవహిస్తుంది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. ఆలయ సమీపాన దుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు.