మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు.. కోర్టుకు 45 మంది..
దిశ, భద్రాచలం టౌన్ : మద్యం తాగి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి ఎస్ఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 45 మందిని భద్రాచలం ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సురేష్ కుమార్ ఎదుట హాజరు పరిచారు. అందులో 22 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 వంతున, ఐదుగురికి ఒక్కొక్కరికి రూ. 2000 […]
దిశ, భద్రాచలం టౌన్ : మద్యం తాగి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి ఎస్ఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 45 మందిని భద్రాచలం ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సురేష్ కుమార్ ఎదుట హాజరు పరిచారు.
అందులో 22 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 వంతున, ఐదుగురికి ఒక్కొక్కరికి రూ. 2000 వంతున.. మొత్తం రూ.2,30,000 జరిమానా విధించారు. 18 మందికి 3 రోజుల చొప్పున న్యాయమూర్తి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి తెలిపారు.