ఖమ్మంలో జోరుగా మద్యం విక్రయాలు
దిశ, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాల ఎదుట మందుబాబుల సందడి నెలకొంది. ఎండను సైతం లెక్క చేయకుండా వైన్ షాపుల ముందు బారుల తీరారు. ఒక్కో షాపు వద్ద వందల సంఖ్యలో క్యూలో నిల్చుని ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 89 దుకాణాలుండగా అన్నింటిలోనూ అమ్మకాలకు అధికారులు అనుమతినిచ్చారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు దుకాణాల వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రత ఏర్పాట్లు చేశారు. ఆరు ఫీట్లకు ఒకరు నిల్చుండేలా చర్యలు తీసుకున్నారు. విక్రయించే ముందు […]
దిశ, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాల ఎదుట మందుబాబుల సందడి నెలకొంది. ఎండను సైతం లెక్క చేయకుండా వైన్ షాపుల ముందు బారుల తీరారు. ఒక్కో షాపు వద్ద వందల సంఖ్యలో క్యూలో నిల్చుని ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 89 దుకాణాలుండగా అన్నింటిలోనూ అమ్మకాలకు అధికారులు అనుమతినిచ్చారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు దుకాణాల వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రత ఏర్పాట్లు చేశారు. ఆరు ఫీట్లకు ఒకరు నిల్చుండేలా చర్యలు తీసుకున్నారు. విక్రయించే ముందు శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకున్నాకే కౌంటర్ వద్దకు అనుమతిస్తున్నారు. ఇక మాస్కు పెట్టుకున్న వారికే మద్యం విక్రయించేలా చర్యలు చేపట్టారు. పెరిగిన రేట్లను ప్రదర్శించేలా దుకాణాల కౌంటర్ల ముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు.
Tags : crowds at wines, liquor stores, wine shops, khammam Police, excise officers