నెలరోజులుగా పనిచేయని హబుల్ టెలిస్కోప్!
దిశ, ఫీచర్స్ : విశ్వంతరాలను శోధించడానికి హబుల్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడిన విషయం తెలిసిందే. హబుల్ టెలిస్కోప్‌ను మొట్టమొదటి సారిగా 1990 ఏప్రిల్ 25న నాసా ప్రయోగించింది. సుమారు 13.4 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలపై పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు దీన్ని ఉపయోగించారు. గొప్ప చరిత్ర కలిగిన ఈ టెలిస్కోపులో తరచూ సాంకేతిక లోపాలు వస్తున్నాయి. ఇటీవల టెలిస్కోప్‌లోని కంప్యూటర్ లోపంవల్ల పలు పరిశోధనలకు ఆటంకం ఏర్పడింది. నెల రోజుల నుంచి […]
దిశ, ఫీచర్స్ : విశ్వంతరాలను శోధించడానికి హబుల్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడిన విషయం తెలిసిందే. హబుల్ టెలిస్కోప్‌ను మొట్టమొదటి సారిగా 1990 ఏప్రిల్ 25న నాసా ప్రయోగించింది. సుమారు 13.4 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలపై పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు దీన్ని ఉపయోగించారు. గొప్ప చరిత్ర కలిగిన ఈ టెలిస్కోపులో తరచూ సాంకేతిక లోపాలు వస్తున్నాయి. ఇటీవల టెలిస్కోప్‌లోని కంప్యూటర్ లోపంవల్ల పలు పరిశోధనలకు ఆటంకం ఏర్పడింది. నెల రోజుల నుంచి హబుల్ టెలిస్కోప్ పునరుద్దరించడానికి చర్యలు తీసుకుంటున్నా, ఇప్పటికీ ఆ సమస్యను నాసా ఇంజనీర్లు పరిష్కరించలేకపోతున్నారు. ఈ అబ్జర్వేటరీని తిరిగి ప్రారంభించే ప్రయత్నంలో బ్యాకప్ హార్డ్‌వేర్‌కు మారాలని ఇంజనీర్ల బృందం యోచిస్తుంది.
1990లో నాసా ఈ టెలిస్కోపును డిస్కవరీ స్పేస్ షటిల్ ద్వారా భూ నిమ్న కక్ష్యలో ప్రవేశపెట్టింది. అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎడ్విన్ హబుల్ పేరు దీనికి పెట్టారు. అంతరిక్షంలోకి పంపిన టెలిస్కోపుల్లో ఇది మొదటిది కాకపోయినా మిగతా వాటికంటే ఇదే పెద్దది. అయితే దీన్ని ప్రయోగించిన కొన్ని వారాల్లోనే హబుల్ పంపించిన చిత్రాల్లో నాణ్యతా లోపాలున్నట్లు గమనించారు. దాంతో ఆస్ట్రోనాట్స్‌కు శిక్షణ అందించి ‘సర్వీసింగ్ మెషిన్’ పేరుతో ఓ యాత్ర చేపట్టింది. ఆనాటి నుంచి ఇప్పటివరకు మేజర్ డిఫెక్ట్స్ సంభవించిన ప్రతీసారి సర్వీసింగ్ మెషిన్స్ యాత్రలు చేపట్టింది.
మేజర్ రీపేర్స్‌తో పాటు, తరుచుగా హబుల్‌లో లోపాలు తలెత్తుతుంటాయి. ఇక ఈసారి కంప్యూటర్‌వల్ల తమ పనులకు ఆటంకం ఏర్పడింది. లోపం సంభవించిన వెంటనే, ప్రధాన కంప్యూటర్ అన్ని సైన్స్ పరికరాలను సురక్షిత-మోడ్ కాన్ఫిగరేషన్‌లో సెట్ చేసింది. అయితే నెలరోజుల నుంచి సిస్టమ్‌ను రీబూట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోవడంతో నాసా అన్ని అంశాలను అంచనా వేయడానికి, హబుల్ బ్యాకప్ హార్డ్‌వేర్‌కు మారడానికి సంబంధించిన నష్టాలను తగ్గించడానికి సమీక్షా సమావేశం నిర్వహించింది. దీని ప్రకారం బ్యాకప్ డేటాకు మారేందుకు పరిశోధకులు సిద్ధమవుతున్నారు. నాసా బ్యాకప్ హార్డ్‌వేర్‌కు మారే విధానాలను ధ్రువీకరించడానికి సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తోంది. టెలిస్కోప్ ఇంత కాలం పనిచేయకుండా ఉండటం ఇదే మొదటిసారి. 2009లో చివరిసారిగా హబుల్‌కు మరమ్మతు చేశారు.
తరచూ సమస్యలు రావడంతో హబుల్ టెలిస్కోప్ స్ధానంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను లాంచ్ చేయాలని నాసా ఎప్పటినుంచో యోచిస్తోంది. అయితే అందుకు సంబంధించిన ప్రయోగాన్ని ఈ ఏడాది అక్టోబర్ 31న జరిపే అవకాశాలున్నాయి.