ఏపీలో జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ అట్టర్ ఫ్లాప్
జనతా కర్ఫ్యూ ఇంటెన్సిటీ (పట్టు)ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనతా కర్ఫ్యూ 14 గంటల పాటు అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటలకు వైద్యులకు చప్పట్లతో సంఘీ భావం ప్రకటించి 9 వరకు కర్ఫ్యూ కొనసాగిద్దామని అన్నారు. దీంతో సోషల్ మీడియాలో కరోనా వైరస్ కేవలం 12 గంటలు మాత్రమే బతికి ఉంటుందని, 7 గంటల నుంచి 5 గంటల వరకే బతుకుతుందని, […]
జనతా కర్ఫ్యూ ఇంటెన్సిటీ (పట్టు)ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనతా కర్ఫ్యూ 14 గంటల పాటు అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటలకు వైద్యులకు చప్పట్లతో సంఘీ భావం ప్రకటించి 9 వరకు కర్ఫ్యూ కొనసాగిద్దామని అన్నారు.
దీంతో సోషల్ మీడియాలో కరోనా వైరస్ కేవలం 12 గంటలు మాత్రమే బతికి ఉంటుందని, 7 గంటల నుంచి 5 గంటల వరకే బతుకుతుందని, చప్పట్ల శబ్దానికి చచ్చిపోతుందని ఇలా అవాకులు చవాకులు ప్రసారమై.. చప్పట్ల పేరిట రోడ్ల మీదకు వచ్చి ఆనందోత్సాహాలు చేశారు. దీంతో జనతా కర్ఫ్యూ సమయం రాత్రి 9 గంటల వరకు అయినా నాలుగు గంటల ముందే దానిని బ్రేక్ చేసి ఫెయిల్ అయినట్టు చేశారు. కొన్ని చోట్ల కాలనీ వాసులంతా ఒక చోట కలిసి పెద్ద శబ్దాలు చేస్తూ తమ ఘనతను చాటుకున్నారు.
దీంతో ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తూ లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే అత్యవసర సేవలు కొనసాగుతాయని, ఇంట్లోనుంచి ఒక్కరే బయటకు రావాలని సూచించారు. ఈ ఒక్క వెసులుబాటు వినియోగించుకునేందుకు ఆంధ్రులు ఉత్సాహం చూపారు. ఒకరి తరువాత ఒకరుగా జనమంతా రోడ్లపై పడ్డారు. ఏ షాపులు, ఏ మార్కెట్లు ఎక్కడ చూసిన జనమే తాండవించారు. ప్రధానంగా కూరగాయల మార్కెట్లైతే.. ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ రేపటి నుంచి దొరకవన్న ఆలోచనతో ఎగబడి కొనేశారు.
ప్రజలంతా రోడ్ల మీదకి రావడంతో లాక్‌డౌన్ ప్రభావం కనిపించలేదు. కొన్ని చోట్ల హోటళ్లలో పార్సిల్ సర్వీసులకు అనుమతివ్వడంతో అక్కడ జనసందోహం కనిపించింది. ఇంకొన్ని పట్టణాల్లో ఆయా ప్రాంతాల నుంచి వేరే చోట్లకు వెళ్లేందుకు ప్రయాణీకులు బారులు తీరారు. దీంతో తొలిరోజు లాక్‌డౌన్ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో సోషల్ మీడియాలో ఫిర్యాదులందుకున్న ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగి బడితె పూజ చేయడం మొదలు పెట్టారు. దీంతో నేటి మధ్యాహ్నానానికి రోడ్లపై జనం పలచబడ్డారు.
Tags: lock down, ap, cities, people on roads, corona virus, covid-19