భారత్‌కు ఆర్థిక సాయం ప్రకటించిన హెచ్ఎస్‌బీసీ
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మరి సెకెండ్ వేవ్‌ను నియత్రించేందుకు, సహాయక చర్యల కోసం హెచ్ఎస్‌బీసీ ఇండియా శుక్రవారం రూ. 75 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ ఆర్థిక సాయం భారత్‌లో లాభాపేక్ష లేని, అభివృద్ధి సంస్థల ద్వారా అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రత్యేకంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్, అట్టడుగు వర్గాలపై దృష్టి సారిస్తూ ఈ నిధులను వినియోగించనున్నట్టు సంస్థ పేర్కొంది. వైద్య సామగ్రి, ఆక్సిజన్ సరఫరా, హైజీన్ కిట్స్, టీకా, జీవనోపాధికి, ఆహారంతో […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మరి సెకెండ్ వేవ్‌ను నియత్రించేందుకు, సహాయక చర్యల కోసం హెచ్ఎస్‌బీసీ ఇండియా శుక్రవారం రూ. 75 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ ఆర్థిక సాయం భారత్‌లో లాభాపేక్ష లేని, అభివృద్ధి సంస్థల ద్వారా అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రత్యేకంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్, అట్టడుగు వర్గాలపై దృష్టి సారిస్తూ ఈ నిధులను వినియోగించనున్నట్టు సంస్థ పేర్కొంది. వైద్య సామగ్రి, ఆక్సిజన్ సరఫరా, హైజీన్ కిట్స్, టీకా, జీవనోపాధికి, ఆహారంతో పాటు కరోనా సంరక్షణ కేంద్రాలకు వైద్య పరికరాలు అందించే విధంగా వీటిని ఉపయోగించనున్నట్టు హెచ్ఎస్‌బీసీ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది.
అదేవిధంగా, ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ సైతం మహమ్మారితో పోరాడేందుకు సుమారు రూ. 10 కోట్ల అందించనున్నట్టు తెలిపింది. అంతేకాకుండా ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు, వైద్య, టెస్టింగ్ పరికరాలకు భారత్‌లోని యూనిసెఫ్‌కు అదనంగా రూ. 15 కోట్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కరోనా మహమ్మరి సెకెండ్ వేవ్ వల్ల ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రాధాన్యత ఇస్తాం. భారత్‌లో తాము బలమైన ఉనికిని కలిగి ఉన్నాం. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశానికి, ప్రజలకు సాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని’ కాగ్నిజెంట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, చైర్మన్ రాజేష్ నంబియార్ చెప్పారు.