హృతిక్ రేంజ్ వేరు: తాప్సీ

హీరోయిన్ తాప్సీ పన్ను.. బాలీవుడ్ గ్రీకు దేవుడు హృతిక్ రోషన్‌కు చాలా పెద్ద ఫ్యాన్. ఒక అభిమానిగా ‘తనతో కోరుకునేది ఒక సెల్ఫీ కాదు.. కలిసి సినిమా చేయడం’ అని చాలాసార్లు చెప్పింది భామ. తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన హవా చూపిస్తున్నా సరే.. హృతిక్ అంటే ఆ పిచ్చి మాత్రం పోదని చెప్తోంది. తన క్రేజీ సక్సెస్‌తో బాలీవుడ్‌ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తున్న తాప్సీ ఆదివారం సోదరి షగుణ్ పన్నుతో కలిసి హృతిక్ ఫస్ట్ సినిమా […]

Update: 2020-06-08 06:22 GMT

హీరోయిన్ తాప్సీ పన్ను.. బాలీవుడ్ గ్రీకు దేవుడు హృతిక్ రోషన్‌కు చాలా పెద్ద ఫ్యాన్. ఒక అభిమానిగా ‘తనతో కోరుకునేది ఒక సెల్ఫీ కాదు.. కలిసి సినిమా చేయడం’ అని చాలాసార్లు చెప్పింది భామ. తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన హవా చూపిస్తున్నా సరే.. హృతిక్ అంటే ఆ పిచ్చి మాత్రం పోదని చెప్తోంది. తన క్రేజీ సక్సెస్‌తో బాలీవుడ్‌ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తున్న తాప్సీ ఆదివారం సోదరి షగుణ్ పన్నుతో కలిసి హృతిక్ ఫస్ట్ సినిమా కహోనా ప్యార్ హై మూవీ చూసిందట. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి ‘ఈ వేదిక హృతిక్‌కు సరిపోదు. ఆయన రేంజ్‌కు థియేటర్లు దద్దరిల్లాలి. ఆ విజిల్స్, ఆ గోల అది హృతిక్ సినిమా చూసే విధానం.. కాబట్టి మళ్లీ మొదటి నుంచి మొదలుపెడుతున్నాం’ అని చెప్పింది.

తాప్సీ ఇన్‌స్టా స్టోరీపై స్పందించిన హృతిక్… ‘అది గొప్ప కాంప్లిమెంట్.. నాకు ఆనందాన్నిచ్చింది’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి పొజిషన్‌లో ఉన్న తాప్సీ.. ‘ఇలా కాంప్లిమెంట్స్ ఇవ్వడం, నా తొలి సినిమా చూసి ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడం.. నవ్వు తెప్పించింది’ అని చెప్పాడు.

Tags:    

Similar News