Instagram Stories రహస్యంగా చూడాలా.. అయితే ఇది ఫాలో అవ్వండి
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ కొనసాగుతోంది. యువత ఇన్ స్టాగ్రాం, వాట్సాప్, ఫేస్ బుక్‌లో చాలా బిజీగా గడుపుతున్నారు. కాస్త టైం దొరికితే చాలు, ఇన్ స్టాలో రీల్స్,
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ కొనసాగుతోంది. యువత ఇన్ స్టాగ్రాం, వాట్సాప్, ఫేస్ బుక్‌లో చాలా బిజీగా గడుపుతున్నారు. కాస్త టైం దొరికితే చాలు, ఇన్ స్టాలో రీల్స్, స్టోరీస్ చూస్తూ ఏంజాయ్ చేస్తుంటారు. ఇక తమ మిత్రులు చూడాలని ఆకర్షణీయంగా స్టోరీస్ పెడుతుంటారు. కొందరు తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన స్టోరీస్ పెడుతారు. అయితే కొందరు తమ ఫ్రెండ్, లేదా, గర్ల్ ఫ్రెండ్ స్టోరీస్‌ను రహస్యంగా చూడాలనుకుంటారు. అయితే ఇప్పటి వరకు ఇన్ స్టా యాజమాన్యం తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇన్ స్టా తమ వినియోగదారులకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది. అదేమిటంటే.. మీరు మీ ఫ్రెండ్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ చూసినట్టు వారికి తెలియకుండా మెటైన్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
1. ఐజీ.. స్టోరీ స్నీక్ ప్రివ్యూ ద్వారా స్టోరీ చూడవచ్చు
Airplane మోడ్ : మీ అండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫొన్‌లలో ఇన్ స్టాగ్రాం యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం ఇన్ స్టా స్టోరీస్ లోడ్ కావడానికి కొన్ని సెకండ్లు వేయిట్ చేయాలి. ఆతర్వాత మీ ఫోన్ Airplane మోడ్ ఆన్ చేసి, ఇప్పుడు మళ్లీ ఇన్ స్టాగ్రాం ఓపెన్ చేయాలి. ఇక మీరు ఎవరి స్టోరీ అయితే చూడాలి అనకుంటున్నారో.. వారి స్టోరీని వారికి తెలియకుండా ఈజీగా చూడవచ్చును.
వెబ్ ద్వారా : మొదటగా క్రోమ్ ఐజీ స్టోరీ క్రోమ్ ఎక్స్ టెన్షన్‌ను ఇన్ స్టాల్ చేయాలి. ఆ తర్వాత ఇన్ స్టాగ్రాం వెబ్ వర్షన్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. ఇలా క్రోమ్ ఎక్స్ టెన్షన్ ఇన్ స్టాగ్రామ్‌లో రహస్యంగా స్టోరీస్ చూడవచ్చును.