ఉరికొయ్యకు వేలాడుతున్న తండ్రిని.. 11ఏళ్ల బాలిక ఎలా కాపాడుకుందో తెలుసా..!
దిశ, వెబ్‌డెస్క్ : చావుబతుకుల్లో ఉన్న తన తండ్రిని కాపాడుకునేందుకు ఓ బాలిక తీవ్రంగా శ్రమించింది. తన సోదరుడి సలహా మేరకు 112కు బాలిక కాల్ చేయడంతో పోలీసులు కూడా అంతేవేగంగా స్పందించారు. పరిస్థితి ఎంత డేంజర్ అనేది అర్థం చేసుకుని మూడు కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3నిమిషాల్లో చేరుకుని బాధిత బాలికకు సాయం అందించారు. చనిపోయాడుకున్న తన తండ్రిని పోలీసులు రక్షించడంతో ఆ చిన్నారి ఎంతగానో సంతోషించింది. అపాయం అని తెలియగానే వెంటనే స్పందించిన పోలీసులపై […]
దిశ, వెబ్‌డెస్క్ : చావుబతుకుల్లో ఉన్న తన తండ్రిని కాపాడుకునేందుకు ఓ బాలిక తీవ్రంగా శ్రమించింది. తన సోదరుడి సలహా మేరకు 112కు బాలిక కాల్ చేయడంతో పోలీసులు కూడా అంతేవేగంగా స్పందించారు. పరిస్థితి ఎంత డేంజర్ అనేది అర్థం చేసుకుని మూడు కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3నిమిషాల్లో చేరుకుని బాధిత బాలికకు సాయం అందించారు. చనిపోయాడుకున్న తన తండ్రిని పోలీసులు రక్షించడంతో ఆ చిన్నారి ఎంతగానో సంతోషించింది. అపాయం అని తెలియగానే వెంటనే స్పందించిన పోలీసులపై అక్కడి స్థానికులు, ఉన్నతాధికారులు ప్రశంసల జల్లులు కురిపించారు.
వివరాల్లోకివెళితే.. యూపీలోని కౌశాంబి జిల్లాలో ఓ వ్యక్తి తన ఫ్యామిలీలో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, కొడుకు, 11ఏళ్ల కూతురు కలదు. అయితే, మంగళవారం సాయంత్రం ఆ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలోనే తన కూతురు కిటిలో నుంచి చూడగా తండ్రి ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించాడు. దీంతో కంగారు పడిపోయిన బాలిక ఈ విషయాన్ని వెంటనే తన సోదరుడికి ఫోన్ ద్వారా తెలిపింది. అప్పుడు అతను అందుబాటులో లేకపోవడంతో చెల్లికి ఓ సలహా ఇచ్చాడు.
దీంతో బాలిక వెంటనే 112 ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేసింది. భయంభయంగా బాలిక తన తండ్రి చావుబతుకులో ఉన్నాడని తెలపగా.. స్పందించిన సబ్ ఇన్‌స్పెక్టర్ శివదాస్ పీఆర్‌వి -1195 కమాండర్, హోంగార్డ్ ప్రేమ్ నారాయణ్ వాహనం డ్రైవర్.. మూడు కిలోమీటర్ల దూరాన్ని కేవలం మూడు నిమిషాల్లోనే చేరుకుని బాలిక తండ్రిని రక్షించారు. తలుపులు పగులగొట్టి బాలిక తండ్రిని కిందకు దించి పరీక్షించగా అతడు చనిపోయాడని అంతా భావించారు.కానీ, అదృష్టవశాత్తు అతను బతికే ఉన్నాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తన తల్లితో జరిగిన గొడవ వల్లే మద్యం మత్తులో తండ్రి ఆత్మహత్యకు యత్నించినట్టు 24ఏళ్ల కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.