EPFO కొత్త రూల్.. డబ్బులు కావాలంటే ఇది తప్పనిసరి
దిశ, వెబ్‌డెస్క్: నెల జీతంలో నుంచి పీఎఫ్ అమౌంట్ కట్ అవుతున్న ఉద్యోగులకు ఆపత్కాలంలో అండగా నిలిచేది ఆ డబ్బులే. ధరఖాస్తు పెట్టుకున్న 45 రోజుల వ్యవధిలోనే ఈ డబ్బులు నేరుగా ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయి. తాజాగా కొవిడ్ కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్ 19 అడ్వాన్స్ కింద కేవలం 7 రోజుల లోపే ఈ డబ్బులను జమచేస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO). తాజాగా EPFO (Employees Provident Fund Organization) కొత్త […]
దిశ, వెబ్‌డెస్క్: నెల జీతంలో నుంచి పీఎఫ్ అమౌంట్ కట్ అవుతున్న ఉద్యోగులకు ఆపత్కాలంలో అండగా నిలిచేది ఆ డబ్బులే. ధరఖాస్తు పెట్టుకున్న 45 రోజుల వ్యవధిలోనే ఈ డబ్బులు నేరుగా ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయి. తాజాగా కొవిడ్ కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్ 19 అడ్వాన్స్ కింద కేవలం 7 రోజుల లోపే ఈ డబ్బులను జమచేస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).
తాజాగా EPFO (Employees Provident Fund Organization) కొత్త నిబంధన పెట్టింది. పీఎఫ్ UAN నెంబర్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. ఇప్పటికే లింక్ చేసుకోవాలని జూన్ 1కే డెడ్‌లైన్ పెట్టినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఉద్యోగులు లింక్ చేసుకోలేదు. దీంతో డెడ్‌లైన్ సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది. వాస్తవానికి గతంలోనే చాలా మంది ఆధార్‌ను లింక్ చేసుకున్నారు. కొంతమంది అవగాహన లేకపోవడంతో లింక్ చేసుకోవడం లేదు.
ఈ నేపథ్యంలోనే లింక్ చేసుకొని వారికి పీఎఫ్ డబ్బులు జమ చేయమని EPFO స్పష్టం చేసింది. కనీసం కొవిడ్ అడ్వాన్స్ కింద కూడా డబ్బులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. UAN నెంబర్‌కు ఆధార్ కార్డు నెంబర్‌ను అనుసంధానం చేస్తేనే పీఎఫ్ డబ్బులు ఆయా ఉద్యోగుల అకౌంట్‌లో జమ చేస్తామని EPFO వెల్లడించింది. ఉమాంగ్, పీఎఫ్ పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
వెంటనే UANతో ఆధార్ లింక్ చేసుకోవడానికి ఈ లింక్‌ను క్లి్క్ చేయండి..
https://iwu.epfindia.gov.in/eKYC/