చెట్లపైనే నివాసం.. ఇది ‘కొండరెడ్ల’ దీనస్థితి
దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు ‘కొండరెడ్ల’ జీవితాల్లో చెప్పుకోలేనంత బాధను మోసుకోచ్చాయి. కనుచూపు మేరంతా నీళ్లే.ఎటుపోవాలో తెలీదు. ఏంచేయాలో అంతు చిక్కదు. కనీసం బతికుండాలంటే రిస్క్ చేయక తప్పదు. దొరికిన దాంతోనే కడుపు నింపుకోవాలి. ఇంట్లోనే వస్తువులను కాపాడుకునేందుకు వారు చేసిన సాహసం అంతా ఇంతా కాదు. వాటిని భూమి మీద పెడితే మొత్తం తడిసిముద్దవుతాయి. దీంతో పుడమిని వదిలి చెట్లపైనే ఆవాసాన్ని ఏర్పరచుకున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు […]
దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు ‘కొండరెడ్ల’ జీవితాల్లో చెప్పుకోలేనంత బాధను మోసుకోచ్చాయి. కనుచూపు మేరంతా నీళ్లే.ఎటుపోవాలో తెలీదు. ఏంచేయాలో అంతు చిక్కదు. కనీసం బతికుండాలంటే రిస్క్ చేయక తప్పదు. దొరికిన దాంతోనే కడుపు నింపుకోవాలి. ఇంట్లోనే వస్తువులను కాపాడుకునేందుకు వారు చేసిన సాహసం అంతా ఇంతా కాదు. వాటిని భూమి మీద పెడితే మొత్తం తడిసిముద్దవుతాయి. దీంతో పుడమిని వదిలి చెట్లపైనే ఆవాసాన్ని ఏర్పరచుకున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చి బాధితులకు సాయం చేసేందుకు ధైర్యం చేయడం లేదు.
ఈ వింత, విషాదకరమైన దృశ్యం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అగ్రహారం, మూలపాడు గ్రామాల్లోని ఏజెన్సీ ప్రాంతాలో కనిపిస్తోంది. అక్కడ జీవనం సాగిస్తున్న కొండ రెడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వారు పడుతున్న ఇబ్బందులను సామాజానికి తెలియజేసేందుకు ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ విభాగానికి చెందిన యువత అక్కడి దృశ్యాలను కెమెరాలో బంధించి బయటకు విడుదల చేశారు. ఆ చిత్రాలను చూసిన వారు ఎవరైనా ‘అయ్యో పాపం’ అనక మానదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలోని కొండరెడ్లు పడుతున్న ఇబ్బందులను పట్టించుకుని.. భవిష్యత్‌లో ఇలాంటివి మళ్లీ తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని పలువురు కోరుతున్నారు.