రూల్స్ బ్రేక్ చేస్తూ ఆ ‘పని’ చేస్తున్న వైద్యుడు.. ఆసుపత్రి సీజ్
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్న కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని స్పెషల్ టీం అధికారులు సీజ్ చేశారు. ఆసుపత్రి వైద్యులుగా చలామణి అవుతున్న డా. సిద్దిరాములును అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర గర్భస్థ పూర్వ లింగ నిర్దారణ చట్టం అధికారులకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గురువారం ఉదయం సాధారణ వ్యక్తుల మాదిరిగా ఓ గర్భిణీ మహిళను […]
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్న కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని స్పెషల్ టీం అధికారులు సీజ్ చేశారు. ఆసుపత్రి వైద్యులుగా చలామణి అవుతున్న డా. సిద్దిరాములును అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర గర్భస్థ పూర్వ లింగ నిర్దారణ చట్టం అధికారులకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గురువారం ఉదయం సాధారణ వ్యక్తుల మాదిరిగా ఓ గర్భిణీ మహిళను ఆసుపత్రికి తీసుకువచ్చి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
లింగ నిర్దారణ కోసం 6 వేలు వైద్యునికి చెల్లించారు. ఈ సందర్బంగా ప్రోగ్రాం అధికారి డా. సూర్యశ్రీ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆసుపత్రిలో విచారణ చేపట్టడం జరిగిందన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న విధంగా ఈ ఆసుపత్రిలో లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. దీని కోసం 6 వేలు ఫీజు తీసుకున్నారని తెలిపారు. ఓ ఆపరేషన్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని పేర్కొన్నారు. ఎలాంటి అర్హత లేకున్నా బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి సంబంధించి పూర్తి వివరాలు జిల్లా వైద్యాధికారికి అందించడం జరిగిందని, ఆసుపత్రిని సీజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.