కరోనా సోకినా పెళ్లి ఆగలేదు.. హాస్పిటల్‌లోనే..
తిరువనంతపురం: కేరళ అలప్పుజా హాస్పిటల్‌లో అరుదైన కార్యక్రమం జరిగింది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ వరుడు ఆస్పత్రి వేదికగా వివాహం చేసుకున్నారు. వధువు పీపీఈ కిట్‌లో అక్కడికి వచ్చింది. ఇరువురూ జీవిత బంధాన్ని ముడివేసుకన్నారు. అలప్పుజాకు చెందిన వరుడు, వధువు ప్రభుత్వ నిబంధనలకు లోబడి, స్థానిక అధికారుల అనుమతితో ఈ వివాహ వేడుకను నిరాడంబరంగా జరుపుకున్నారు. అబ్రాడ్‌లో పనిచేసే శరత్ మోన్, అభిరామిలు పెళ్లి చేసుకోవడానికి ఏడాది కిందటే నిర్ణయించుకున్నారు. కానీ, కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌లతో వాయిదా […]
తిరువనంతపురం: కేరళ అలప్పుజా హాస్పిటల్‌లో అరుదైన కార్యక్రమం జరిగింది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ వరుడు ఆస్పత్రి వేదికగా వివాహం చేసుకున్నారు. వధువు పీపీఈ కిట్‌లో అక్కడికి వచ్చింది. ఇరువురూ జీవిత బంధాన్ని ముడివేసుకన్నారు. అలప్పుజాకు చెందిన వరుడు, వధువు ప్రభుత్వ నిబంధనలకు లోబడి, స్థానిక అధికారుల అనుమతితో ఈ వివాహ వేడుకను నిరాడంబరంగా జరుపుకున్నారు. అబ్రాడ్‌లో పనిచేసే శరత్ మోన్, అభిరామిలు పెళ్లి చేసుకోవడానికి ఏడాది కిందటే నిర్ణయించుకున్నారు. కానీ, కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌లతో వాయిదా వేసుకుంటూ వచ్చారు. తొలి వేవ్ కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ పెళ్లి పనులు ప్రారంభించారు.
సెకండ్ వేవ్ ఉధృతిలో శరత్ మోన్‌కు ఆయన తల్లికి పాజిటివ్‌గా తేలినట్టు కరోనా టెస్టు ఫలితాలొచ్చాయి. దీంతో వందానం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఈ నెల 25న అడ్మిట్ అయ్యారు. కానీ, ఈ సారి తమ పెళ్లిని వాయిదా వేసుకోవాలని ఆ జంట భావించలేదు. పెట్టుకున్న ముహూర్తానికే పెళ్లిచేసుకోవాలని నిశ్చయించుకుంది. అంతే, జిల్లా కలెక్టర్, హాస్పిటల్ సూపరింటెండెంట్‌ల అనుమతి తీసుకుని కరోనా తమ నూతన జీవితాన్ని అడ్డుకోబోదని తొలి అడుగువేశారు. పెళ్లి అనంతరం వధువు ఆమె బంధువుల ఇంటికి వెళ్లారు. కరోనా నెగెటివ్ వచ్చి, క్వారంటైన్ సమయం ముగిసిన తర్వాతే ఇంటికి చేరనున్నట్టు సమాచారం. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.