గుర్రానికి అంత్యక్రియలు.. తరలివచ్చిన జనాలు

దిశ, వెబ్ డెస్క్ : ఓ గుర్రం చనిపోతే కరోనాను కూడా లెక్కచేయకుండా వేలాదిగా జనం తరలివచ్చి అంత్య క్రియలు చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావిలోని మరాడిమట్ ప్రాతంలో చోటుచేకుంది. అయితే కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యలు అంత్యక్రియలకు వెళ్లాడానికే ప్రజలు జంకుతున్నారు. పైగా అంత్యక్రియలకు వెళ్లడానికి ఇరవైమందికే ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాంటి సమయంలో ఓ గుర్రం చనిపోతే వేలాదిగా జనం తరలి వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి గుర్రం అత్యక్రియల్లో పాల్గొన్న ఊరిపై […]

Update: 2021-05-24 04:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఓ గుర్రం చనిపోతే కరోనాను కూడా లెక్కచేయకుండా వేలాదిగా జనం తరలివచ్చి అంత్య క్రియలు చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావిలోని మరాడిమట్ ప్రాతంలో చోటుచేకుంది. అయితే కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యలు అంత్యక్రియలకు వెళ్లాడానికే ప్రజలు జంకుతున్నారు. పైగా అంత్యక్రియలకు వెళ్లడానికి ఇరవైమందికే ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాంటి సమయంలో ఓ గుర్రం చనిపోతే వేలాదిగా జనం తరలి వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి గుర్రం అత్యక్రియల్లో పాల్గొన్న ఊరిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరాడిమఠ్ గ్రమాన్ని సీజ్ చేసి అందరికీ కరోనా పరిక్షలు చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. అయితే మ‌రాడిమ‌ట్ ప్రాంతంలోని ఓ ఆశ్రమంలో సిద్ధేశ్వర మ‌ఠానికి చెందిన గుర్రాన్ని దేవ‌తా అశ్వంగా గ్రామ‌స్థులు భావిస్తారని అందుకోసమే ఆ గుర్రం అంత్యక్రియల్లో పాల్గొన్నట్టు వారు తెలిపారు.

Tags:    

Similar News