Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈరోజు మంచి లాభాలు రావడం మీకు చాలా

Update: 2024-03-27 18:45 GMT

మేష రాశి : ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈరోజు మంచి లాభాలు రావడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

వృషభరాశి : నేడు ఈరాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త. అనుకోని ప్రయాణాలు మంచి లాభాలను తీసుకొస్తాయి. కానీ కొంత మందికి ఈరోజు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు బాగుంటుంది. ఈ రాశి వారు శుభకార్యలల్లో పాల్గొనే అవకాశం ఉంది.

మిథున రాశి : మిథున రాశి వారికి నేడు శుభప్రదంగా ఉంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఎవరైతే చాలా రోజులుగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం. ఉంది కోర్టు విషయాలు మీకు అనుకూలంగా వస్తాయి.

కర్కాటక రాశి : నేడు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.చిన్న చిన్న పనులకోసం ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం వలన చిక్కుల్లో పడుతారు. డబ్బు విషయంలో జాగ్రత్తలు అవసరం.

సింహ రాశి : ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలల్లో పాల్గొంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోవడం వలన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కన్యా రాశి : నేడు మీ అధిక ఖర్చులు కుటుంబంలో కలహాలకు కారణం అవుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు కలిసి వస్తుంది. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సానుకూల వాతవారణం ఉండటంతో పాటు, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

తుల రాశి : ఈ రాశి వారు అప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. నేడు ఈ రాశి వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. రుణసదుపాయం లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు నేడు చాలా సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి : విద్యార్థులు నేడు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతి విషయంలో ఆచీ తూచీ అడుగు వేయడం చాలా మంచిది. వివాహాది శుభకార్యాలకు నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. నేడు ఈ రాశిలోని వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే కానుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది.

ధనస్సు రాశి : నేడు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, దీర్ఘకాలిక వ్యాధుల వలన సమస్యలు ఎదుర్కొంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కలిసి వస్తుంది. నేడు ఈ రాశి వారికి ఉన్నత పదువుల్లో అవకాశం లభిస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

మకర రాశి : ఈ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశిలోని వారు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. సీనియర్ల నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో వీరి సమస్యలన్నీ తీరి నేడు చాలా సంతోషంగా గడుపుతారు.

కుంభ రాశి : నేడు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. కానీ ఆఫీసులో మీ ప్రవర్తన కొంత మందికి నచ్చకపోవడంతో సమస్యల్లో చిక్కుకుంటారు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

మీన రాశి : నేడు ఈ రాశి వారు మీకు తెలియకుండా మీరే ఇబ్బందులను సృష్టించుకొని, సీనియర్ల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ భాగస్వామి ప్రవర్తన మీకు అంతగా నచ్చదు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం


Similar News