Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (25-10-2024)

ఈ రోజు రాశి ఫలాలు (25-10-2024)

Update: 2024-10-24 21:30 GMT

మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని పొరపాట్లు చేయొచ్చు. ఈ కారణంగా మీకు ఉన్నతాధికారుల నుంచి కొంత ఇబ్బంది రావొచ్చు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు జీవనోపాధి రంగంలో కొందరు కొత్త వ్యక్తులతో పరిచయాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీరు సన్నిహితంగా ఉండే వారి సలహా తీసుకోవాలి. ఈ రోజు మీ స్నేహితుని దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకుంటారు.

మిథున రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు పాత వివాదాలు, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ పిల్లలు మీరు చేసే పనుల్లో సాయం చేస్తారు. మీ మనసులో కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతిని అందించి సర్‌ప్రైజ్ చేయొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలుంటే, అది ఈరోజు ముగిసే అవకాశం ఉంది.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు నమ్మకంతో ఏదైనా పని చేస్తే, దాని వల్ల మీరు కచ్చితంగా అపారమైన ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు మీరు మీ ఉద్యోగంలో సహోద్యోగులతో కలిసి పని చేయడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు కార్యాలయంలో మీ జీవిత భాగస్వామి యొక్క పురోగతిని చూసి సంతోషిస్తారు.

కన్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులలో ఒకరి పెళ్లి గురించి చర్చలు జరుగుతాయి.

తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏదైనా వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు, ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీరు ఇలా చేస్తే, వారు మీ ఒప్పందాన్ని నిలిపివేయొచ్చు. దీంతో మీరు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. సాయంత్రం మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. దీంతో భవిష్యత్తులో మీకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను పొందుతారు. మీకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతారు.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులలో కొందరితో మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

కుంభ రాశి: ఈ రాశి వారిలో వ్యాపారులు కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి తొందరపడాల్సి రావొచ్చు. ఈ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. ఈ కారణంగా మీ శత్రువులు కూడా మిత్రులుగా మారొచ్చు.అయితే మీరు వారితో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి: ఈ రాశి వారు ఈరోజు మీ వ్యాపారానికి సంబంధించి ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేయబోతున్నట్లయితే, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఈ సాయంత్రం మీకు తెలిసిన వారితో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News