Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 28-10-2024)

ఈ రోజు ఖర్చులు బాగా పెరుగుతాయి. దీని వలన మీరు చిరాకు పడుతుంటారు. అంతక ముందు దాచిన డబ్బు ఈ రోజు ఉపయోగపడుతుంది.

Update: 2024-10-27 22:00 GMT

మేష రాశి : ఈ రోజు ఖర్చులు బాగా పెరుగుతాయి. దీని వలన మీరు చిరాకు పడుతుంటారు. అంతక ముందు దాచిన డబ్బు ఈ రోజు ఉపయోగపడుతుంది. మీ నిర్లక్ష్యం వల్ల వ్యాపారాల్లో నష్టాలు చూస్తారు. వ్యక్తిగత స్థాయిలో, మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు సమస్యలను సృష్టించవచ్చు. బిజినెస్ విషయంలో మీ జీవిత భాగస్వామికి, మీకు గొడవ జరగవచ్చు.

వృషభ రాశి: సంతృప్తికరమైన జీవితం కోసం మీ మానసిక శక్తిని పెంపొందించుకోండి. ఈ రోజు ఉదయం కొంచం మీకు అశాంతి కలిగించవచ్చును. మీ పాత స్నేహితులను కలుసుకుని మీ బాధలు షేర్ చేసుకుంటారు. టెన్షన్ ను పక్కన పెట్టి మీతో మీరు కొంత సమయం గడపండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పిన పనిని చేయండి.

మిథున రాశి: ఈ రాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులలో కొందరితో మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

కర్కాటక రాశి: ఈ రాశికి చెందినవారు విదేశాలలో మీ వ్యాపారాన్ని చేయాలనుకుంటే.. అది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు, స్నేహితుల నుండి అనుకోని బహుమతులు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వాళ్లకి చెప్పి చేయండి.

సింహ రాశి : ఈ రోజు మీరు వెతుకుతున్న మీ కలల రాణి కనిపిస్తుంది. చూసిన మొదటి సారిలోనే ప్రేమలో పడతారు. మీకు ఇష్టమైన సామాజిక సేవల్లో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించండి. మీ చుట్టుపక్కల వారి ప్రవర్తన కారణంగా మీకు చాల కోపం వస్తుంది. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కన్యా రాశి: ఆరోగ్య సమస్యల విషయంలో మీ స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ అవాస్తవ, ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలు డబ్బు కొరతకు దారితీయవు. మీ కఠినమైన ప్రవర్తన మీ పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి, లేకపోతే మీ మధ్య అడ్డంకి ఏర్పడుతుంది.

తులా రాశి: ఈ రోజు.. ఈ రాశికి చెందిన కొందరు విద్యార్థులు టీవీ, కంప్యూటర్లు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ అంచనాలను మించి ఈరోజు మిమ్మల్ని సంతోషపరుస్తాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. దీంతో భవిష్యత్తులో మీకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు పాత వివాదాలు, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ పిల్లలు మీరు చేసే పనుల్లో సాయం చేస్తారు. మీ మనసులో కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతిని అందించి సర్‌ప్రైజ్ చేయొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలుంటే, అది ఈరోజు ముగిసే అవకాశం ఉంది.

మకర రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు జీవనోపాధి రంగంలో కొందరు కొత్త వ్యక్తులతో పరిచయాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీరు సన్నిహితంగా ఉండే వారి సలహా తీసుకోవాలి. ఈ రోజు మీ స్నేహితుని దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకుంటారు. సాయంత్రం మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. కుటుంబ సభ్యులలో ఒకరి పెళ్లి గురించి చర్చలు జరుగుతాయి.

మీన రాశి: ఈ రాశి వారు ఈరోజు భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని పొరపాట్లు చేయొచ్చు. ఈ కారణంగా మీకు ఉన్నతాధికారుల నుంచి కొంత ఇబ్బంది రావొచ్చు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.


Similar News