Today's Horoscope : నేటి రాశిఫలాలు
ఈ రాశి వారికి నేడు సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురిఅయితే ,మీరు ఆర్ధికసమస్యలను ఎదురుకుంటారు. మీరు ఈసమయంలో డబ్బుకంటే మీకుటుంబానికే ప్రాధాన్యత
మేష రాశి : ఈ రాశి వారికి నేడు సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురిఅయితే ,మీరు ఆర్ధికసమస్యలను ఎదురుకుంటారు. మీరు ఈసమయంలో డబ్బుకంటే మీకుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. మీరు అనుకున్నదానికంటే మీ సోదరుడు, మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేస్తాడు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. క్రొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఏవిధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తెలివైన పని కాదు. కొన్ని అత్యవసర పనులు మిమ్ముల్ని ఒత్తిడికి గురి చేస్తాయి.
వృషభరాశి : ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి. నేడు మీరు విచ్చల విడిగా ఖర్చు చేస్తారు. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది.
మిథున రాశి : మీరు అనుకున్నవన్నీ నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటంవలన మీరు ఈరోజు ఆర్ధికసమస్యలను ఏదురుకుంటారు.కానీ ఇది మిమ్ములను అనేక సమస్యలనుండి కాపాడుతుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీకు బాగా ఇష్టమైన వారినుండి బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎక్జైటింగ్ రోజు. ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి.
కర్కాటక రాశి : బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.ఈరోజు మీరు ధనాన్ని పొదుపుచేయగలుగుతారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులనుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్దిని చేకూరుస్తుంది. ఈరాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీకోర్కెలు తీర్చుకోడానికి,పుస్తకపఠనం,మీకు ఇష్టమైనపాటలు వినడానికి ఈసమయాన్ని వాడుకుంటారు. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు.
సింహ రాశి : మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్ గా ఉంచగల పనులలో నిమగ్నమవండి. తెలివిగా మదుపు చెయ్యండి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి కలిసి వస్తుంది. ఉద్యోగులకు నేడు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
కన్యా రాశి : తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. స్నేహితులు, ఆత్మీయులతో చేసే పనులు కలిసివస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు.
తుల రాశి : వీలైనంతగా రిలాక్స్ అవండి. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. పండుగలు , వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. 'సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలిసొస్తుంది.
వృశ్చిక రాశి :విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్- టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయేలాగ, సంతోషంగా ఉంచుతాయి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారస్తులు నేడు నష్టాలు చవిచూడక తప్పదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
ధనస్సు రాశి : మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటంవలన మీరు ఈరోజు ఆర్ధికసమస్యలను ఎదుర్కొంటారు.కానీ ఇది మిమ్ములను అనేక సమస్యలనుండి కాపాడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆకమిట్ మెంట్, వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఈరోజు మీరు చాలా చురుకుగా పని చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు.
మకర రాశి : నేడు ఈ రాశి వారికి భాగస్వామ్య ప్రాజెక్ట్‌లు సానుకూల ఫలితాలకంటే వ్యతిరేక ఫలితాలే ఎక్కువగా ఇస్తాయి. సెక్యూలేషన్ ద్వారా లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు.
కుంభ రాశి : నేడు ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధననష్టం కలుగుతుంది. ఏదైనా కొత్త పని చేపట్టే ముందు ఆలోచించడం మంచిది. ఉద్యోగులకు వారి కార్యాలయాల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.
మీన రాశి : పనులలో అదృష్టం కలిసివస్తుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. పాతబాకీలు కొంతవరకు వసూలు అవుతాయి. నూతన ఉద్యోగంలో చేరవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. గతంతో పోలిస్తే ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.