Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

ఆర్థికంగా బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు నేడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి.

Update: 2024-02-14 18:45 GMT

మేష రాశి : ఈ రోజు ఈరాశి వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఎవరైతే చాలా కాలంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంటుంది.

వృషభ రాశి : ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. సీనియర్లతోనూ, సహచరులతోనూ పోటీ ఉన్నప్పటికీ అధికారం ఈ రాశివారినే వరించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆదాయం, రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

మిథున రాశి : వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. కొందరు అతి ముఖ్యమైన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటక రాశి : విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

సింహ రాశి : ఆరోగ్యం బాగుంటుంది. గతంలో మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచిఫలితాలు అందుతాయి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్, మీ బిజీ ప్రణాళికనుండి, చక్కని విశ్రాంతిని, సౌకరాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది.

కన్యా రాశి : నుకోని కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం వస్తుంది. మీ కుటుంబంలో చిన్న పిల్లల ఆరోగ్యం పాడవడం మీకు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది.

తుల రాశి : నేడు ఈ రాశి వారు అనుకున్న పనులన్నీ తీరిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆఫీసుల్లో పని చేసే వారికి ఒత్తిడి పెరిగిపోతుంది.ఇంట్లో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చిక రాశి : సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకోవడం అవసరం. రక్షణ, న్యాయ, బోధన, ఆడిటింగ్‌, ప్రకటనలు, ట్రావెల్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. సాయిబాబా ఆరాధన మంచిది.

ధనస్సు రాశి : ఆర్థికంగా బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు నేడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి.

మకర రాశి : ఈరోజు ఈరాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం వస్తుంది. మీ కుటుంబంలో చిన్న పిల్లల ఆరోగ్యం పాడవడం మీకు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది.

కుంభ రాశి : నేడు ఈరాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు మీకు ఆందోళనను కలిగిస్తాయి. దగ్గరివారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి,లేనిచో మీకు ఆర్ధికనష్టాలు తప్పవు. దూరప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

మీన రాశి :ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు వస్తాయి. ఈ రాశి వారు రోజుమొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యల్లో పాల్గొనే అవకాశం ఉంది.

Tags:    

Similar News