Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (23-12-2024)

నేడు మీరు ఇష్టమైన వారితో ప్రశాంతంగా గడుపుతారు.కానీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.

Update: 2024-12-22 21:45 GMT

మేష రాశి: నేడు మీరు ఇష్టమైన వారితో ప్రశాంతంగా గడుపుతారు.కానీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. సెమినార్లు ఇస్తారు. దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. భాగస్వామితో కలిసి ఎక్జైటింగ్ పనులు చేస్తుంటారు. పెద్దవారి సలహాలు తీసుకుంటారు. రాశి వారి ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. 

వృషభ రాశి: ఉద్యోగస్థులకు నేడు కలిసి వస్తుంది. ప్రమోషన్లు అందుకుంటారు. నేడు ఈ రాశివారు అపరిమితమైన ఎనర్జీగా, ఉత్సాహంగా ఉంటారు. నేడు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తారు ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. జిమ్ కు వెళ్తారు. భాగస్వామితో సాయంత్రం వేళ సంతోషంగా గడుపుతారు.కానీ వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉండండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.

మిథున రాశి: నేడు ఈ రాశివారు ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయి. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు. కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది. నేడు పక్షులకు గింజలు వేస్తే మంచి జరుగుతుంది.

కర్కాటక రాశి: కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ ను వదిలేయండి. ఓటమి పాలవుతారు. కానీ వెంటనే విజయాలు మీ సొంతమవుతాయి. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా నడుస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీ భాగస్వామితో రాత్రిపూట గొడవ పడుతారు.

సింహ రాశి: నేడు ఈ రాశి వారు ఆఫీసులో ఇతరులతో మాట్లాడుతూ టైమ్ వేస్ట్ చేయకండి. తొందరగా బయట పడేందుకు ప్రయత్నించండి. మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ చివర వరకు ధనాన్ని పొదుపు చేస్తారు. ఈ రాశివారు ఖర్చును తగ్గిస్తే మంచిది. అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. 

కన్యా రాశి: ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కూతూహాలాన్ని రేకెత్తించే మంచి విషయాలు చదవండి. మీ శ్రీమతి తరపున బంధువులు కారణంగా గొడవలు జరుగుతాయి. నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి. కష్టపడి పని చేస్తారు. 

తులా రాశి: నేడు ఈ రాశి వారు డబ్బు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెట్టాలో నేర్చుకుంటారు. పలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చిన్న చిన్న పార్టీలకు అటెంట్ అవుతుంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

వృశ్చిక రాశి: మీరు ఎప్పటినుంచో కుడబెట్టిన ధనాన్ని మీ పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పిల్లల్ని బాగా మోటివేట్ చేయండి. అద్భుతాలు జరుగుతాయి. మంచి నవలను కానీ, మ్యాగజైన్ కానీ చదువుతారు. సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు. ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు.

ధనుస్సు రాశి: మెంటల్‌గా, ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నించండి.కాగా యోగా ధ్యానం చేయండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తారు.

మకర రాశి: రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆలోచన చేస్తారు. విహార యాత్రలకు వెళ్తారు.కానీ అనారోగ్యంతో దీర్ఘకాలికంగా పోరాడుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువగా గడుపుతారు. దీంతో మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో పలు గొడవలు జరుగుతాయి. బంధువుల కారణంగా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. ఆర్థికంగా నష్టపోతారు. 

కుంభ రాశి: కుటుంబం సమస్యల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. బంధువుల ఇంటికెళ్తారు. దీంతో రిలాక్స్ అవుతారు. నేడు మీ దగ్గరి వాళ్లను అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా మెలగండి. మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు. 

మీన రాశి: ఇవాళ మీరు మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. మీ బాల్య దశను నెమరువేసుకుంటారు. మీరు చేసిన ఏ పనులు అయినా సరే మీ చుట్టూ ఉన్నవారిని మెప్పిస్తాయి. ఫ్రెండ్స్ తో కలిసి పిక్‌నిక్ వెళ్తారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవండి. యోగా చేయడం మంచిది. దీంతో మానసిక ప్రశాంతత పొందుతారు. 

Tags:    

Similar News