Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు
ఈరోజు ప్రారంభం ఈరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఖర్చులు అధికం అవ్వడం కాస్త ఇబ్బందికి గురిచేస్తాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. విద్యార్థులకు కలసి
మేష రాశి : ఈరోజు ప్రారంభం ఈరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఖర్చులు అధికం అవ్వడం కాస్త ఇబ్బందికి గురిచేస్తాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. విద్యార్థులకు కలసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఎవరైతే చాలా కాలంగా రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులు చదువు పై శ్రద్ధ పెట్టడం అవసరం.
వృషభ రాశి : నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి ఆచీతూచీ తీసుకోవడం మంచిది. ఆర్థికంగా బాగుంటుంది. సమాయానికి స్నేహితుల నుంచి డబ్బు చేతికందుతుంది. ఈరోజు కుటుంబసభ్యలతో మీరు ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటారు. ఉమ్మడి వ్యాపారంలో ఉన్నవారికి కలసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటాబయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక బంధం బాగుంటుంది.
మిథున రాశి : ఇతరులకు చెడుచెయ్యాలన్న ఆలోచనలను రానిస్తే మీకే మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఈ రకమైన ఆలోచనలు జీవితాన్ని వృధా చేస్తాయి, పైగా మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కనుక వీటిని మానండి. విదేశాల్లో సంబంధాలు ఉన్నవ్యాపారస్థులకు,ట్రేడ్వర్గాల వారికి కొంతధననష్టం సంభవిస్తుంది.కాబట్టి అడుగువేసేముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. మీరు మరీ ఉదారంగా ఉంటే, మీకు బాగా దగ్గరివారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును, ఇధి మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి, మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. మీ పై అధికారి గమనించేలోగానే మీ పెండింగ్ పనులను పూర్తిచెయ్యండి.
కర్కాటక రాశి : ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్ర్త అవసరం. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.ఈరోజు మీరు మీ స్నేహితులతో కలసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారికి నేడు ఆఫీసులో ఇబ్బందికర వాతావరణం ఇతరులు కలిగించే అవకాశం ఉంది. అందువలన జాగ్రత్తగా ఉండటం మంచిది.
సింహ రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరో తెలియని వారి సలహాల ద్వారా పెట్టుబడిలు పెట్టి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు. చిన్న పిల్లల ఆరోగ్యంపట్ల జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయడానకి ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు.
కన్యా రాశి :ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగ పరంగా శుభవార్త అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం కలిగించవు. విద్యార్థులకు అన్ని విధాలుగాను బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
తుల రాశి :ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. విలాసాల మీద ఖర్చు చేయడం తగ్గించండి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా మారుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.
వృశ్చిక రాశి : ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభదాయంగా ఉంటాయి. వాటి వలన మీకు అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మీతో ఆనందంగా గడుపుతుంది. ముఖ్యమైన పనులు త్వరగా నెరవేరుతాయి.
ధనస్సు రాశి : కొన్ని మానసిక వత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరులయొక్క సహాయసహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని అనివార్యకారణముల వలన మీరు చేపట్టిన పనులుమధ్యలోనే ఆగిపోతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం సానుకూలంగా ఉంటుంది.
మకర రాశి : వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పారిశ్రామిక వేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సమయం ప్రోత్సాహకరంగా ఉంది. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మీదే. సేవాభావంతో పనులు చేస్తారు.
కుంభ రాశి : ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజూచివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. ఒక శూభవార్త అందే అవకాశమున్నది. అది మిమ్మల్నే కాదు, కుటుంబాన్నంతటినీ ఊపేస్తుంది. మీ ఆతృతను అదుపులో ఉంచుకొండి. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీన రాశి :సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ జీవితం బాగానే ఉంటుంది.