Today's Horoscope : నేటి రాశిఫలాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే

నేడు ఈ రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు. గతంలోని మీ ప్రేమ తాలుకు జ్ఞాపకాలు మిమ్ముల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. ఖర్చులను కాస్త అదుపు తెచ్చుకోవాలి.ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చి

Update: 2024-02-01 18:45 GMT

మేష రాశి : నేడు ఈ రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు. గతంలోని మీ ప్రేమ తాలుకు జ్ఞాపకాలు మిమ్ముల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. ఖర్చులను కాస్త అదుపు తెచ్చుకోవాలి.ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చి అత్యద్భుతమయిన లాభాలను తెచ్చి పెడతాయి.ఈరోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి : నాయకత్వ లక్షణసారం అనేది అంతా, ఆత్మ విశ్వాసంలో ఉంటుందని గుర్తించండి. ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. మీరు ఎక్కడ,ఎలా ,ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుసుకుని,దానికి తగట్టుగా వ్యహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చుచేయవలసి ఉంటుంది.

మిథున రాశి : నేడు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారామే కానుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు నేడు అద్భుతంగా ఉండనుంది. చాలా విషయాల్లో ఈరోజు మీరు ముందుంటారు. మీ వైవాహిక జీవితంలో నేడు అత్యద్భుతమైన రోజు కానుంది.

కర్కాటక రాశి : ఈరోజు ఇంట్లోకార్యక్రమాలు చేయటము వలన,మీరు అధికంగా ధనమును ఖర్చుపెట్టవలసి ఉంటుంది.ఇది మీయొక్క ఆర్ధికపరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. కొంతమంది, తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటివారు, మాటలేకానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపొండి.

సింహ రాశి :ఈరోజు మీకు బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు, విద్యా విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. భాగస్వామి విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. లేకపోతే సమస్యల్లో పడుతారు.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. ఉన్నతాధికారులు మీతో చాలా సంతోషంగా గడుపుతారు. ఈ కారణంగా మీ స్థానం కూడా మెరుగుపడుతుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయగలిగితే, వ్యాపారులు మంచి లాభం పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది.

తుల రాశి :మీస్నేహితుని నిర్లిప్తత, పట్టించుకోనితనం మిమ్మల్ని బాధిస్తుంది. కానీ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అది మిమ్మల్ని బాధించకుండా, ఇంకాచెప్పాలంటే కష్టకాలాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పుఅడిగి తిరిగి సెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. మీకు దగ్గరి బంధువులు లేదా స్నేహితులనుండి శుభవార్త అందడంతో, రోజు మొదలవుతుంది. మీ తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని ఈ రోజు మీరు చవిచూడనున్నారు.

వృశ్చిక రాశి : నేడు ఈ రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి నేడు అధిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. విద్యార్థులు ప్రతీ విషయంలో ఆచీ తూచి అడుగు వేయడం మంచిది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీరు చేసే కొన్ని పనుల వలన కష్టాల పాలు అవుతారు. అందువలన జాగ్రత్తగా ఉండటం మంచిది.


ధనస్సు రాశి : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. దీంతో భవిష్యత్తులో మీకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను పొందుతారు. మీకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతారు.

మీన రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏదైనా భూమి లేదా భవనం కొనాలనుకుంటే అది మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారానికి సంబంధించి ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేయబోతున్నట్లయితే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాయంత్రం మీకు తెలిసిన వారితో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News