Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు
విద్యార్థులకు నేడు కలిసి వచ్చే రోజు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుది. ఇంట్లో కలహాలు మీకు మానసిక అశాంతిని కలిగిస్తుంది.ఈ రోజు మీకు బయటకు
మేష రాశి : విద్యార్థులకు నేడు కలిసి వచ్చే రోజు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుది. ఇంట్లో కలహాలు మీకు మానసిక అశాంతిని కలిగిస్తుంది.ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో, లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు. దూరపు ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.
వృషభ రాశి : ఈరోజు మీకు ఆఫీసులో అద్భుతమైన రోజుగా గడుస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. భాగస్వాములతో వ్యాపారం చేసే ముందు ఆలోచించడం మంచిది. ఆదాయం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి.
మిథున రాశి : మీ కొంత వినోదంకోసం, ఆఫీసునుండి త్వరగా బయట పడడానికి ప్రయత్నించండి. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. శ్రీమతితో తగిన సంభాషణలు, సహకారము బంధాన్ని బలోపేతం చేస్తాయి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ ప్రైజ్ దొరుకుతుంది. డబ్బుసంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. మీ చుట్టాలందరికి దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈ రోజు మిగిలిపోనుంది.
కర్కాటక రాశి : ఈరోజు బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి,ఇది మీకు కలిసివస్తుంది. ఇంటిపని చాలా అలసటను కలిగిస్తుంది, అదే మానసిక వత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. మీప్రియమైనవారు వారి కుటుంబపరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు.వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. అంతులేని ఆత్మికానందం తాలూకు అనుభూతి ఈ రోజు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. వ్యక్తిగత సమయము ఎంతముఖ్యమో తెలుసుకుంటారు,ఈరోజు మీకు చాలా ఫ్రీసమయము దొరుకుతుంది,మీరు ఆడుకోడానికి లేక జిమ్ కు వెళతారు.
సింహ రాశి : ఈ రాశి వారు నేడు అధికంగా ఖర్చులు చేస్తుంటారు. దీంతో ఆర్థిక సమస్యలు ఎదురు అవుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని ప్రయాణాలు లాభాలను తీసుకొచ్చి పెడుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
కన్యా రాశి : ఈ రాశి వారు నేడు అధికంగా ఖర్చులు చేస్తుంటారు. దీంతో ఆర్థిక సమస్యలు ఎదురు అవుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని ప్రయాణాలు లాభాలను తీసుకొచ్చి పెడుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
తుల రాశి : నేడు ఈ రాశి వారికి ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇది మీకు ఆర్ధికలాభాన్ని చేకూరుస్తుంది. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. సీనియర్లనుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి.
వృశ్చిక రాశి : చాలా కాలంగా బాధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయట పడుతారు. చంద్రునియొక్క స్థానప్రభావమువలన మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చుచేస్తారు.మీరు మీ ఆర్థికస్థిని మెరుగుపరుచుకోవాలంటే మీ జీవితభాగస్వామితో,తల్లితండ్రులతో మాట్లాడండి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. ఉద్యోగస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఈరోజు ఈ రాశి వారు తమ కార్యాలయాల్లో ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు.
ధనస్సు రాశి : ఒక సంతోషకరమైన వార్త అందవచ్చును. ఈరాశిలో ఉన్న స్థిరపడిన, పేరుపొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించుట మంచిది. ఎవరితో కలిసిఉంటున్నారో, వారితో వాదనకు దిగకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు తావునిచ్చే ఏవిషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి కలిసి వస్తుంది. ఆదాయం బాగుంటుంది.
మకర రాశి : నేడు ఈ రాశి వారి జీవితం అందమైన మలుపు తిరగనుంది. ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం లభిస్తుంది.ఈ రోజు ఈరాశి వారు సామాజిక కార్యక్రమాలకు, పార్టీస్‌కు వెళ్లి ఏంజాయ్ చేస్తారు. మీకు సంతోషాన్ని ఇచ్చి పనులు చేయండి. నేడు అనుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి : ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగులతో సఖ్యత అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ, కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు.
మీన రాశి : అదృష్టం కలిసివస్తుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పారిశ్రామిక వేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.