Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు
శారీరక శ్రమ పెరుగుతుంది. అదృష్టం కలిసివస్తుంది. డబ్బు చేతికి అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో సర్దుబాట్లు అవసరం అవుతాయి. ఈ వారం పట్టువిడుపులు ప్రదర్శించాలి
మేష రాశి : శారీరక శ్రమ పెరుగుతుంది. అదృష్టం కలిసివస్తుంది. డబ్బు చేతికి అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో సర్దుబాట్లు అవసరం అవుతాయి. ఈ వారం పట్టువిడుపులు ప్రదర్శించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. రాబడి పెరుగుతుంది.
వృషభ రాశి : ఈ రాశి వారికి నేడు డబ్బు విలువ తెలిసి వస్తుంది. అవసరానికి డబ్బు చేతికందక చాలా సమస్యలు ఏర్పడుతాయి.కుటుంబసభ్యుల మధ్య డబ్బుసంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును.మీరు కుటుంబసభ్యలకి ఆర్ధికవిహాయల్లో,రాబడిలో దాపరికంలేకుండా ఉండాలి అని చెప్పండి. మీరు ఈరోజు ప్రేమలో పడడం అపవిత్రులను చేయగలదు. జాగ్రత్త. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది, పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి, అందుకే, సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి.దీని వలన మీకు నేడు కలిసి వస్తుంది.
మిథున రాశి : ఈరోజు మీరు డబ్బుఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చుపెట్టటమువలన మీయొక్క భవిష్యత్తుమీద ఎలాంటి ప్రతికూలప్రభావము చూపుతుందో తెలుసుకుంటారు. ఇంటిపని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకోకుండా అవకాశాలు వస్తాయి. రోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి : విభేదాన్ని మానండి, అది మీకు మరింత అనారోగ్యాన్ని కలిగిస్తుంది. మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు,లేనిచో ఇదిమీభవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మీ కుటుంబసభ్యుల అవసరాలను తీరచడమే ఇవాళ్టి మీ ప్రాధాన్యత. అంతులేని ఆత్మికానందం తాలూకు అనుభూతి ఈ రోజు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. ఎవరైతే విదేశీట్రేడ్ రంగాల్లోఉన్నారోవారికి అనుకున్నఫలితాలు సంభవిస్తాయి.ఈరాశిలోఉన్న ఉద్యోగస్తులుకూడా వారిపనితనాన్నిచూపిస్తారు. ఈరోజు ఖాళిసమయంలో ,పనులుప్రారంభించాలి అని రూపకల్పనచేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు.
సింహ రాశి : ఈరోజు ఈ రాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. చాలా రోజుల నుంచి పెండిగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. ఈ రోజు ఈ రాశి వరకు చాలా స్పెషల్‌గా ఉంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
కన్యా రాశి : ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా తరచూ సమస్యలు తలెత్తడం తప్పకపోవచ్చు. ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ వారం తప్పకుండా చాలావరకు పరిష్కారం అవుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. యాక్టివిటి బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా, ప్రశాంతంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలు సంతృప్తికర స్థాయిలో లాభాలు తెచ్చిపెడతాయి.
తుల రాశి : కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం అవసరం. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులకు స్థానచలన సూచన.
వృశ్చిక రాశి : ఈరోజు ఈ రాశి వారు ఏదోఒక పని పై లీనం అవుతుంటారు. ప్రమాదాల భారిన పడే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఈరోజు సంతోషంతో నిండిన మంచి రోజు కానుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కష్టపడితే తప్ప ఫలితం దక్కదు.
ధనస్సు రాశి : మీరు ఈ రోజు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది. ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీకు మంచి ఆలోచలనలు వస్తాయి. మీ వస్తువులను భద్రంగా ఉచుకోకపోతే పోయే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో మీరు అనుకోని విధంగా మార్పులు వస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి, మీతో గొడవ పడే అవకాశం ఉంది.
మకర రాశి :డబ్బును పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబలో చిన్న పిల్లలతో సరదాగా గడపండి. దీని వాళ్ళ మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నేడు మీ ప్రేమ వల్ల కొత్త సమస్యలు వస్తాయి. ఈ రోజు మీరు కొన్ని పనులను చేయలేకపోతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కుంభ రాశి : ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ ప్రేమ మీకు ఒక విలువైన వస్తువుగా మారనుంది. దీని వల్ల సంతోష పడతారు. మీరు పని చేసే ఆఫీసులో మీకు నచ్చని పనులు జరుగుతాయి. అది చూసి మీకు చాలా కోపం వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
మీన రాశి :ఈ రాశి వారికి నేడు సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురిఅయితే ,మీరు ఆర్ధికసమస్యలను ఎదురుకుంటారు. మీరు ఈసమయంలో డబ్బుకంటే మీకుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. మీరు అనుకున్నదానికంటే మీ సోదరుడు, మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేస్తాడు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. క్రొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి