తుల రాశి : ఈరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. నిర్మాణాది కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు, విందులకు హాజరవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వృత్తి, వ్యాపారాలలో అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. సంతోషంగా ఉంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి.