Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 10-01-2025)
ఈ రోజు రాశి ఫలాలు ( 10-01-2025)
మేష రాశి : ఈ రోజు మీరు వెతుకుతున్న మీ కలల రాణి కనిపిస్తుంది. చూసిన మొదటి సారిలోనే ప్రేమలో పడతారు. మీకు ఇష్టమైన సామాజిక సేవల్లో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించండి. మీ చుట్టుపక్కల వారి ప్రవర్తన కారణంగా మీకు చాల కోపం వస్తుంది. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
వృషభ రాశి: సంతృప్తికరమైన జీవితం కోసం మీ మానసిక శక్తిని పెంపొందించుకోండి. ఈ రోజు ఉదయం కొంచం మీకు అశాంతి కలిగించవచ్చును. మీ నిర్లక్ష్యం వల్ల వ్యాపారాల్లో నష్టాలు చూస్తారు. వ్యక్తిగత స్థాయిలో, మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు సమస్యలను సృష్టించవచ్చు. బిజినెస్ విషయంలో మీ జీవిత భాగస్వామికి, మీకు గొడవ జరగవచ్చు
మిథున రాశి: ఆరోగ్య సమస్యల విషయంలో మీ స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ అవాస్తవ, ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలు డబ్బు కొరతకు దారితీయవు. పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీరు ప్రేమను పంచకపోతే, మీ దగ్గరికి ప్రేమ రాదు. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామి హర్ట్ అవుతుంది.
కర్కాటక రాశి: మీ భావోద్వేగాలు అదుపు చేసుకోవాలి. మీ అసాధారణ ప్రవర్తన, ఇతరులకు బాధ కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికీ ఈ సమయం కలిసి వస్తుంది. ఇతరుల కోసం ఆలోచించింది చాలు .. మీ కోసం మీరు కొంత డబ్బును దాచుకోండి. ఈ రోజు సాయంత్రం శుభవార్తలు వింటారు.
సింహ రాశి : మీ స్నేహితునికి మాట ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి. మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబంతో గడుపుతారు. తొందర పాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తర్వాత, మీరు జీవితంలో బాధ పడాల్సి వస్తుంది. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలియనుంది.
కన్యా రాశి: ఇతరులను కించపరచకండి. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. ఈ రోజు ఖాళీ సమయంలో ఐస్ క్రీములు , చాక్లెట్లు తినే అవకాశమున్నది. మీ జీవిత భాగస్వామికి మాట ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి.
తులా రాశి: ఈ రాశికి చెందినవారు విదేశాలలో మీ వ్యాపారాన్ని చేయాలనుకుంటే.. అది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు, స్నేహితుల నుండి అనుకోని బహుమతులు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వాళ్లకి చెప్పి చేయండి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా నీరసంగా ఉంటారు. కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోండి. అనుకోని బిల్లులు ఖర్చులను పెంచుతాయి. అయితే, దాని మీరు వల్ల ఆందోళన చెందుతారు.మీ కఠినమైన ప్రవర్తన మీ పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి, లేకపోతే మీ మధ్య అడ్డంకి ఏర్పడుతుంది.
ధనస్సు రాశి : ఈ రోజు.. ఈ రాశికి సమయాన్ని వృథా చేస్తారు. కొందరు విద్యార్థులు టీవీ, కంప్యూటర్లు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ అంచనాలను మించి ఈరోజు మిమ్మల్ని సంతోషపరుస్తాయి.
మకర రాశి: ఈ రాశి వారు విహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. మీ ఆర్ధిక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. మీ పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. మీరు బాగా ప్రేమించే వారిని ఈ రోజు కలుస్తారు. వారి వలన మీతో మీరు ప్రేమలో పడతారు.
కుంభ రాశి: ఇతరులను విమర్శించే ముందు గల మీరు ఇతరుల విమర్శకు గురయ్యే అవకాశమున్నది. క్రొత్తవి నేర్చుకోవాలనుకున్న వారికీ ఈ సమయం అనువైనది. ఈ రోజు ఖర్చులు బాగా పెరుగుతాయి. దీని వలన మీరు చిరాకు పడుతుంటారు. అంతక ముందు దాచిన డబ్బు ఈ రోజు ఉపయోగపడుతుంది.
మీన రాశి: ఆఫీసులో ఈ రోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంతగానో దోహదపడతాయి. చిన్నపుడు మీరుచేసిన పనులు ఈరోజు మళ్ళి తిరిగిచేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి..లేదంటే మీ ఇద్దరికీ గొడవ జరిగే అవకాశం ఉంది.