Rahu - Mars Transit: 100 ఏళ్ల తర్వాత అరుదైన గ్రహల కదలికలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

ఈ గ్రహాల సంచారాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది

Update: 2025-01-10 06:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, శని తర్వాత అతి ముఖ్యమైన గ్రహాల్లో రాహువు, అంగారక గ్రహాలు. ఈ గ్రహాల సంచారాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. చాలా అరుదుగా ఇవి సంచారం చేస్తుంటాయి. కానీ, కొన్ని సార్లు ఇవి నక్షత్ర సంచారం కూడా  చేస్తాయి. అయితే, వందేళ్ళ తర్వాత ఈ గ్రహాల సంచారం జరగబోతోంది. దీని ప్రభావం, కొన్ని రాశుల వారిపై చూపనుంది. అలాగే, వారి జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

సింహ రాశి

వందేళ్ళ తర్వాత ఈ రెండు గ్రహాల నక్షత్ర సంచారం జరగడం వలన ఈ రాశి వారికీ అన్ని విధాలుగా కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, వీరికి కెరీర్‌ కొత్త మలుపు తిరుగుతుంది. అంతేకాకుండా, ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. అలాగే, మీ భార్యతో విహార యాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.  

ధనుస్సు రాశి

ఈ రెండు గ్రహాల నక్షత్ర సంచారం ధనుస్సు రాశివారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా, మీరు బాగా ప్రేమిస్తున్న వ్యక్తిని పెళ్ళి చేసుకునే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే, డబ్బు సమస్యల కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.


Tags:    

Similar News