చంద్రగ్రహణం రోజే హోలీ..ఏ రాశి వారు ఏ రంగుతో కలిసి వస్తుందో తెలుసా?
ఈ సారి హోలీ పండుగ రోజే చంద్రహణం ఏర్పడనుంది. హోలీ పండుగను చాలా మంది రంగు రంగులతో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే హోలీ రోజే చంద్రగ్రహణం ఏర్పడుతున్న
దిశ, ఫీచర్స్ : ఈ సారి హోలీ పండుగ రోజే చంద్రహణం ఏర్పడనుంది. హోలీ పండుగను చాలా మంది రంగు రంగులతో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే హోలీ రోజే చంద్రగ్రహణం ఏర్పడుతున్న కారణంగా, ఈ రాశుల వారు ఈ రంగుతో హోలీ ఆడుకోవడం వలన అదృష్టం, ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు పండితులు. కాగా, ఏ రాశి వారు ఏ రంగుతో హోలీ ఆడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి వారు హోలీ పండుగను ఎరుపు రంగుతో జరుపుకోవడం చాలా మంచిది అంటున్నారు జ్యోతిష్యులు.
వృషభ రాశి శుక్రుడు చే పాలించబడుతుంది కాబట్టి, ఈ రాశి వారు తెలుపు రంగుతో హోలీ ఆడుకోవాలి.
మిథున రాశి వారు లేత నీలం రంగుతో హోలీ ఆడుకోవాలంట, అదే విధంగా ఆకుపచ్చ రంగుతో హోలీ ఆడుకున్నా వీరికి కలిసి వస్తుంది.
కర్కాటక రాశి చంద్రునితో పాలించబడుతుంది. ఈ రాశి వారు తెలుపు రంగుతో హోలీ ఆడుకోవాలి.
సింహరాశి సూర్యునిచే పాలించబడుతుంది. సింహరాశి వారు ముదురు ఎరుపు, నారింజ, పసుపు రంగులతో హోలీ ఆడుకోవచ్చు.
కన్యా రాశి వారు ముదురు ఆకుపచ్చ రంగుతో హోలీ సెలబ్రేట్ చేసుకోవాలి.
తులారాశి వారు పసుపు, తెలుపు హోలీ వేడుకల్లో వినియోగిస్తే మంచిది.
వృశ్చిక రాశి ముదురు ఎరుపు రంగుతో హోలీ ఆడుకోవడం మంచిది.
మకర రాశి వారు నీలం రంగుతో హోలీ ఆడుకోవడం మంచిది.
కుంభ రాశి వారు నలుపు , ముదురు నీలం శుభ రంగులను ఉపయోగించడం వల్ల కుంభరాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది.
మీన రాశి వారు హోలీ వేడుకల్లో పసుపు రంగును ఉపయోగించడం మంచిది.