Shravana Masam: శ్రావణ మాసంలో ఆ రాశుల వారికి డబ్బే..డబ్బు!
నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది
దిశ, ఫీచర్స్ : నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. నిత్యం పూజలు చేసే వారు ఈ మాసం అయి పోయే వరకు మాంసాహారం ముట్టరు. ఈ రోజు శ్రావణ మాసంలోని మొదటి సోమవారం కావడంతో ఉదయం నుంచి భక్తులు శివాలయానికి వెళ్తారు. హిందు పురాణాల ప్రకారం శివుడిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఇదిలా ఉండగా ఈ నెలలో కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించనున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి మంచిగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి శ్రావణ మాసం కలిసి వస్తుంది. ఈ సమయంలో కొత్త పనులు కూడా మొదలు పెడతారు. మీ ఖాళీ సమయంలో
కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవిస్తారు. పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఉపశమనం పొందుతారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.
సింహ రాశి
శ్రావణ మాసం సింహ రాశివారికి శుభాలను తెస్తుంది. మీ జీవిత భాగస్వామికి, మీకు ఇప్పటి వరకు ఉన్న గొడవలు అన్ని సద్దుమణిగి పోవడం ఖాయం. మీరు కొనుగోలు చేసిన భూములు రేట్లు పెరగడమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బు కూడా వస్తుంది. ఈ సమయంలో పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు. ప్రతీ సోమవారం శివుడి గుడికి వెళ్లి పూజ చేస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.