2040 నాటికి వంద శాతం ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు : హోండా మోటార్!
దిశ, వెబ్‌డెస్క్: 2040 నాటికి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు, ఫ్యుయెల్ సెల్ వాహనాల(ఎఫ్‌సీవీ) అమ్మకాలను సాధించగలమని ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఏప్రిల్ ప్రారంభంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవిని చేపట్టిన తర్వాత మొదటి మీడియా సమావేశంలో మాట్లాడిన తొషిహిరో మిబే..ప్రధాన మార్కెట్లన్నిటిలో 2030 నాటికి 40 శాతం అమ్మకాలను, 2035 నాటికి 80 శాతం, 2040 నాటికి 100 శాతం అమ్మకాలను జరుగుతాయని కంపెనీ భావిస్తోంది. ఆటోమొబైల్ టెక్నాలజీలో […]
దిశ, వెబ్‌డెస్క్: 2040 నాటికి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు, ఫ్యుయెల్ సెల్ వాహనాల(ఎఫ్‌సీవీ) అమ్మకాలను సాధించగలమని ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఏప్రిల్ ప్రారంభంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవిని చేపట్టిన తర్వాత మొదటి మీడియా సమావేశంలో మాట్లాడిన తొషిహిరో మిబే..ప్రధాన మార్కెట్లన్నిటిలో 2030 నాటికి 40 శాతం అమ్మకాలను, 2035 నాటికి 80 శాతం, 2040 నాటికి 100 శాతం అమ్మకాలను జరుగుతాయని కంపెనీ భావిస్తోంది. ఆటోమొబైల్ టెక్నాలజీలో ఎలక్ట్రిక్ వాహనాలను పెరుగుతున్న డిమాండ్ మధ్య తొహిషిరో హోండా మోటార్ కంపెనీ సీఈఓగా బాధ్యతలను తీసుకున్నారు. హోండా గతేడాది ఆగష్టులో పూర్తిగా ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసింది. 2030 నాటికి ప్రధాన మారెట్లలో తన అన్ని మోడళ్లలో అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్‌ను చేర్చాలని కంపెనీ లక్ష్యంగా ఉన్నట్టు తొషిహిరో చెప్పారు.