హోండా సరికొత్త స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్ గ్రాజియా విడుదల!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) తన సరికొత్త గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ మోడల్ ధర రూ. 82,564(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్ బీఎస్6తో 125సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా సైడ్-స్టాండ్ ఇండికేటర్ లక్షణాలతో అధునాతన ఫీచర్లను ఇందులో అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రీ-క్రాఫ్టెడ్ లుక్‌తో, రేసింగ్ స్ట్రిప్స్, […]

Update: 2021-01-18 06:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) తన సరికొత్త గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ మోడల్ ధర రూ. 82,564(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్ బీఎస్6తో 125సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా సైడ్-స్టాండ్ ఇండికేటర్ లక్షణాలతో అధునాతన ఫీచర్లను ఇందులో అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రీ-క్రాఫ్టెడ్ లుక్‌తో, రేసింగ్ స్ట్రిప్స్, రెడ్-బ్లాక్ కలర్లలో రియర్ సస్పెన్షన్‌లను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. గడిచిన 20 ఏళ్లలో హోండా స్కూటర్ మెరుగైన ఆదరణను కలిగి ఉందని, ఈ సరికొత్త గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్‌తో ప్రీమియం స్కూటర్ విభాగంలో మరింత మందికి ఆకర్షిస్తుందని హెచ్ఎంఎస్ఐ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సీఈవో అట్సుషి ఒగాటా చెప్పారు. యువతతో పాటు, ప్రత్యేకంగా రైడింగ్‌ని ఇష్టపడే వారికి హోండా గ్రాజియా మొదటి ఎంపిక అవుతుందని, కంపెనీ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యద్విందర్ సింగ్ వెల్లడించారు.

Tags:    

Similar News