మొక్కల సంరక్షణపై హెచ్ఎండీఏ దృష్టి
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో సిబ్బంది తక్కువగా ఉన్నా సరే.. మొక్కల సంరక్షణ కోసం హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 158 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఓఆర్ఆర్‌పై 28 నర్సరీలు, 16 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లను హెచ్ఎండీఏలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అభివృద్ధి చేస్తుండగా గ్రీనరీ, మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టింది. 136 వాటర్ ట్యాంకర్లతో మొక్కలకు నీళ్లు పెడుతున్నారు. సర్వీస్ రోడ్ల వెంబడి ఉన్న ప్లాంటేషన్, రైల్వే కారిడార్, ఓపెన్ స్పేస్‌లలో ఉన్న మొక్కలకు నీళ్లు […]
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో సిబ్బంది తక్కువగా ఉన్నా సరే.. మొక్కల సంరక్షణ కోసం హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 158 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఓఆర్ఆర్‌పై 28 నర్సరీలు, 16 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లను హెచ్ఎండీఏలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అభివృద్ధి చేస్తుండగా గ్రీనరీ, మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టింది. 136 వాటర్ ట్యాంకర్లతో మొక్కలకు నీళ్లు పెడుతున్నారు. సర్వీస్ రోడ్ల వెంబడి ఉన్న ప్లాంటేషన్, రైల్వే కారిడార్, ఓపెన్ స్పేస్‌లలో ఉన్న మొక్కలకు నీళ్లు అందిస్తూ వేసవిలో వాడిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లుగా హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
Tags: HMDA, Lockdown, Urban Forestry, Greenery, ORR