దీపావళి పండుగకు జాగ్రత్త తీసుకోవాలి : గొల్లమందల సురేష్

దిశ, కల్లూరు : ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ పరిధిలో గొల్లమందల సురేష్ ప్రభుత్వ హిందీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా కాలంలో వైరస్ గురించి కల్లూరు పరిధిలో అన్ని గ్రామాలకు తిరుగుతూ అవగాహన కల్పించాడు. తన సొంత సైకిల్ పై కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేశాడు. ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రచారం చేశాడు. సైకిల్ కు ముందు […]

Update: 2021-11-04 06:26 GMT

దిశ, కల్లూరు : ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ పరిధిలో గొల్లమందల సురేష్ ప్రభుత్వ హిందీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా కాలంలో వైరస్ గురించి కల్లూరు పరిధిలో అన్ని గ్రామాలకు తిరుగుతూ అవగాహన కల్పించాడు. తన సొంత సైకిల్ పై కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేశాడు. ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రచారం చేశాడు.

సైకిల్ కు ముందు మైక్ కట్టుకుని ఊరూరా తిరుగుతూ ప్రజలకు తనదైన సేవలు చేశాడు. దీపావళి పండుగ సందర్భంగా కల్లూరు పోలీస్ స్టేషన్ లో ట్రైనింగ్ ఎస్ఐ శ్వేత లక్ష్మి సమక్షంలో దీపావళి పండుగ ముందస్తు జాగ్రత్తలు ప్రచారం చేశాడు. ఈ కార్యక్రమంలో భాగంగా కల్లూరు పట్టణంలో గొల్లమందల సురేష్ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ ఎస్ ఐ శ్వేత లక్ష్మి, పోలీస్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News