సూపర్: మూడు ప్రాణాలను కాపాడిన హిజ్రాలు..

దిశ, మహబూబాబాద్ : నేటి సమాజంలో హిజ్రాలంటే చులకగా చూసేవారు అడుగడుగునా తారసపడుతుందటారు. కానీ ఆ హిజ్రాలే మూడు నిండు ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా దన్నసరి గ్రామానికి చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన తన ఇద్దరు పిల్లలతో కేసముద్రం రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. అదే సమయంలో అక్కడే ఉన్న హిజ్రాలు అడ్డుకొని తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడారు. […]

Update: 2021-09-25 09:02 GMT

దిశ, మహబూబాబాద్ : నేటి సమాజంలో హిజ్రాలంటే చులకగా చూసేవారు అడుగడుగునా తారసపడుతుందటారు. కానీ ఆ హిజ్రాలే మూడు నిండు ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా దన్నసరి గ్రామానికి చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన తన ఇద్దరు పిల్లలతో కేసముద్రం రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. అదే సమయంలో అక్కడే ఉన్న హిజ్రాలు అడ్డుకొని తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. కేసముద్రం రైల్వే స్టేషన్‌లో మహబూబాబాద్ వెళ్లడానికి ఆరుగురు హిజ్రాలు ప్లాట్ ఫాంపై నిరీక్షిస్తున్నారు.

అదే సమయంలో అటు నుండి వస్తున్న రైలుకు ఎదురుగా తల్లి ఇద్దరు పిల్లలను తీసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి పరుగెత్తుతుండగా, గమనించిన హిజ్రాలు హుటాహుటిన పరిగెత్తి వారిని అడ్డుకుని ప్రాణాలు కాపాడారు. ఇద్దరి చిన్నారులను చూసి చలించిపోయి వెయ్యి రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ ఘటన చూసిన పలువురు ప్రయాణికులు హిజ్రాల ధైర్యానికి అభినందనలు తెలిపారు. ఈ హిజ్రాలకు ధైర్యం ఎక్కువే అని పలువురు చమత్కరించారు.

Tags:    

Similar News