హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ

దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ కనగరాజు నియామక జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారని సస్పెండ్ చేసింది. కనగరాజు నియామకం చెల్లదని ప్రాథమికంగా అభిప్రాయపడింది. కనగరాజు నియామకాన్ని హైకోర్టులో న్యాయవాది పారా కిషోర్ సవాల్ చేశారు. ఈ పిల్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిబంధనలు పాటించకుండా కనగరాజును నియమించారని న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదించారు.

Update: 2021-09-16 05:29 GMT

Tags:    

Similar News