కంగనాను అరెస్ట్ చేయొద్దు: ముంబై హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చదేల్‌కు ముంబయి పోలీసులు ఇటీవల మూడోసారి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన సిస్టర్స్ సోషల్ మీడియా పోస్ట్‌లు ఉన్నాయని క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కంగనా రనౌత్‌కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయొద్దని బాంబే హైకోర్టు మహారాష్ట్ర పోలీసులను […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చదేల్‌కు ముంబయి పోలీసులు ఇటీవల మూడోసారి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన సిస్టర్స్ సోషల్ మీడియా పోస్ట్‌లు ఉన్నాయని క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కంగనా రనౌత్‌కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయొద్దని బాంబే హైకోర్టు మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో తమ సోదరుడి పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నామని, అందుకే పోలీసుల ముందు హాజరుకాలేమని తొలిసారి జారీ చేసిన సమన్లకు వీరిరువురు సమాధానమివ్వగా, ఈ నెల 10న పోలీసుల ముందు హాజరవ్వాలని ఈ నెల 3న రెండోసారి తాకీదులు పంపారు. కంగన మాత్రం సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ విచారణకు హాజరు కాకుండా వాయిదా వేస్తున్నారు. ఆమె సమన్లకు స్పందించకపోవడంతోపాటు, షూటింగ్‌లకు హాజరు కావడంతో ముంబై పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తమపై ఉన్న కేసును కొట్టేసేలా ఆదేశాలను ఇవ్వాలని కంగన, రంగొలీ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తాము సోషల్ మీడియాలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, కేవలం తమ ఉద్దేశాలను మాత్రమే వెల్లడించామంటూ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. అంతేగాక పోలీసుల సమన్లను తాము గౌరవిస్తున్నామని చెప్పారు. కంగన వాదనను విన్న హైకోర్టు, ఇప్పుడే వీరిని అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. 2021 జనవరి 8న పోలీసుల ముందు హాజరుకావాల్సిందిగా కంగన, రంగోలీని న్యాయస్థానం ఆదేశించింది.