ఆన్‌లైన్ లోన్ యాప్స్ బ్లాక్ చేయండి : HC ఆర్డర్
దిశ, తెలంగాణ బ్యూరో : మొబైల్ ఫోన్లలో ‘రుణ’ యాప్‌లను బ్లాక్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ యాప్‌లను తొలగించడానికి ఆయా ప్లాట్‌ఫారంల యాప్ స్టోర్ ప్రతినిధులను సంప్రదించాలని స్పష్టం చేసింది. మూలాలు ఎక్కడున్నాయో, వాటి నిర్వాహకులు ఎవరో తెలుసుకుని చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కొద్దిమంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలను ప్రస్తావిస్తూ కల్యాణ్ దీప్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి […]
దిశ, తెలంగాణ బ్యూరో : మొబైల్ ఫోన్లలో ‘రుణ’ యాప్‌లను బ్లాక్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ యాప్‌లను తొలగించడానికి ఆయా ప్లాట్‌ఫారంల యాప్ స్టోర్ ప్రతినిధులను సంప్రదించాలని స్పష్టం చేసింది. మూలాలు ఎక్కడున్నాయో, వాటి నిర్వాహకులు ఎవరో తెలుసుకుని చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
కొద్దిమంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలను ప్రస్తావిస్తూ కల్యాణ్ దీప్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని రుణ యాప్‌ల నియంత్రణ లేకపోవడంతో చాలా చోట్ల వేధింపులకు గురయ్యే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయని నొక్కిచెప్పారు.
పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో నమోదైన ఫిర్యాదులు, కేసులు తదితరాలన్నింటిపై నివేదిక సమర్పించాల్సిందిగా ముగ్గురు పోలీసు కమిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.