టెన్త్, ఇంటర్ పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశమని వ్యాఖ్యానించింది. కరోనా దృష్ట్యా పరీక్షలపై ప్రభుత్వం పునరాలోచించాలంది. పక్క రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేస్తే.. మీరు ఎలా నిర్వహించాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే3కి హైకోర్టు వాయిదా వేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశమని వ్యాఖ్యానించింది. కరోనా దృష్ట్యా పరీక్షలపై ప్రభుత్వం పునరాలోచించాలంది. పక్క రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేస్తే.. మీరు ఎలా నిర్వహించాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది.
దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే3కి హైకోర్టు వాయిదా వేసింది.