జగన్ సర్కార్‌కు హైకోర్టు బిగ్ షాక్
దిశ, ఏపీ బ్యూరో: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేసింది. పంచాయితీ సర్పంచ్‌లు, సెక్రటరీలు అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 2ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. […]
దిశ, ఏపీ బ్యూరో: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేసింది. పంచాయితీ సర్పంచ్‌లు, సెక్రటరీలు అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 2ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పంచాయతీ సర్పంచ్ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
ఇప్పటివరకు సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను వీఆర్‌వోలకు అప్పగించడమేంటని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం జీవోను సస్పెండ్ చేసింది. ఇకపోతే జీవో నెంబర్ 2పై ప్రతిపక్ష పార్టీలు సైతం తీవ్ర విమర్శలు చేశాయి. పంచాయతీ రాజ్ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థలో బదలాయించడంపై మండిపడ్డారు. ఈ జీవో నెంబర్ 2 వల్ల సర్పంచ్‌లకు ఉన్న హక్కులు నిర్వీర్యమైపోతాయని ప్రతిపక్షాలు విమర్శించిన సంగతి తెలిసిందే.